Tuesday, October 15, 2024
Homeజాతీయంఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో భారీ వ‌ర్షాలు.. 14మంది మృతి

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో భారీ వ‌ర్షాలు.. 14మంది మృతి

Date:

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌తో అత‌లాకుత‌ల‌మ‌వుతోంది. గత శనివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.గంగా, శారదా, ఘఘ్రా సహా తదితర నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. దీంతో నదీ పరివాహ ప్రాంతాల్లోకి వరద పోటెత్తుతోంది. ఇక ఈ వర్షాల కారణంగా సంభవించిన ప్రమాదాల్లో ఇప్పటి వరకూ 14 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తాజాగా తెలిపారు.

మీరట్‌లోని జాకీర్‌ కాలనీలో భవనం కూలిన ఘటనలో 10 మంది వరకూ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇక గోండాలో ఆదివారం జరిగిన వేర్వేరు ఘటనల్లో ఓ మహిళ సహా ఇద్దరు వ్యక్తులు నీటిలో మునిగి చనిపోయారు. షాజహాన్‌పూర్‌లోని నది నుండి మేకను రక్షించే ప్రయత్నంలో ఇద్దరు పిల్లలు మునిగిపోయారు. మరో నలుగురు పిల్లల్ని కాపాడినట్లు షాజహాన్ పూర్ ఎస్పీ తెలిపారు. మరోవైపు ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో కురుస్తాయని వాతావరణ శాఖ ఇప్పటికే వెల్లడించింది. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని తెలిపింది.