ఆన్‌లైన్‌ రుణాలపై కేంద్రం హెచ్చరిక

Date:

ఆన్‌లైన్‌ రుణాలపై కేంద్ర ప్రభుత్వం మరోసారి హెచ్చరించింది. ‘క్యాష్ఎక్స్‌పాండ్‌-యూ’ పేరిట ఆన్‌లైన్‌లో రుణాలు అందించే యాప్‌ నకిలీదేనని పేర్కొంది. అంతేకాకుండా ఈ యాప్‌ను గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి తొలగించామని, యూజర్లు కూడా ఫోన్లలో వెంటనే తొలగించాలని సూచించింది.

”CashExpand-U Finance Assistant-లోన్‌ యాప్‌పై జాగ్రత్త. ఇది నకిలీది. దీని మూలాలు శత్రు దేశంలో ఉన్నట్లు తెలిసింది” అని పేర్కొంటూ ప్రభుత్వ సైబర్‌ క్రైమ్‌ విభాగం సైబర్‌ దోస్త్‌ వెల్లడించింది. ఈ యాప్‌ను తక్షణమే ఫోన్ల నుంచి తీసివేయాలని, తద్వారా కీలక సమాచారం దుర్వినియోగం కాకుండా చూసుకోవచ్చని తెలిపింది.

స్వల్ప రుణాలు ఇస్తామంటూ ఆన్‌లైన్‌లో అనేక యాప్‌లు చూస్తుంటాం. ఇటువంటి యాప్‌లు విశ్వసించేవి కావని, వాటితో యూజర్ల ఆర్థిక సంబంధ సమాచారం దుర్వినియోగమయ్యే అవకాశాలుంటాయని ప్రభుత్వం హెచ్చరిస్తూనే ఉంది. ఇందుకు సంబంధించి గతేడాది 1062 ఫిర్యాదులు వచ్చినట్లు ప్రభుత్వం ఇటీవల వెల్లడించింది. అటు గూగుల్‌ కూడా 2023 సెప్టెంబర్‌ నెలలో ఒకే వారంలో 134 ఫేక్‌ యాప్‌లను ప్లేస్టోర్‌ నుంచి తొలగించినట్లు అప్పట్లో ప్రకటించింది.

Share post:

Popular

More like this
Related

ట్రైనీ డాక్ట‌ర్ శ‌వ‌ప‌రీక్ష కీల‌క‌పత్రం మిస్సింగ్‌

ప‌శ్చిమ‌బెంగాల్ కోల్‌కతా ట్రైనీ డాక్టర్‌ శవపరీక్షకు సంబంధించిన కీలక పత్రం మిస్‌...

డాక్ట‌ర్ల నిర‌స‌న వ‌ల్ల 23మంది రోగులు మృతి

ప‌శ్చిమ‌బెంగాల్ కోల్‌క‌తాలో జూనియ‌ర్ వైద్యురాలిపై జ‌రిగిన అత్యాచారం, హ‌త్య‌పై ప‌శ్చిమ బెంగాల్‌తో...

నిర్మాణంలో ఉన్న ఇళ్లను మాత్ర‌మే కూల్చుతున్నాం

ఎఫ్‌టీఎల్‌, బ‌ఫ‌ర్‌జోన్‌లోకి వ‌చ్చే నిర్మాణ ద‌శ‌లో ఉన్న ఇళ్ల‌ను మాత్ర‌మే కూలుస్తున్నామ‌ని...

ఎవ‌రికి అర్థం కాని మందులు రాసిన వైద్యుడు

పెషేంట్ల‌కు వైద్యులు రాసే మందులు అర్థ‌మ‌య్యే విధంగా ఉండాల‌ని ప్ర‌భుత్వ నిబంధ‌న‌లు...