Saturday, December 7, 2024
Homeజాతీయంఆదివాసీ బిడ్డ‌ను రాష్ట్ర‌ప‌తి చేశాం

ఆదివాసీ బిడ్డ‌ను రాష్ట్ర‌ప‌తి చేశాం

Date:

ఆదివాసీ బిడ్డ ద్రౌపదీ ముర్మును రాష్ట్రపతిని చేయడం ఎన్డీఏ అదృష్టంగా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అన్నారు. భావిస్తున్నామని పేర్కొన్నారు. మొదట్లో ఆ పదవికి ఆమె పేరును ప్రతిపాదించగానే ముర్మును భారీ మెజారిటీతో గెలిపించాలని బిహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ దేశం మొత్తానికి పిలుపునిచ్చారని ప్రధాని గుర్తుచేసుకున్నారు. పీఎం జన్‌మన్‌ యోజన పథకం ద్వారా పనుల ప్రారంభ ఘనత ద్రౌపదీ ముర్ముదే అని కొనియాడారు. ఆదివాసీల కష్టాలను తీర్చేందుకు ఈ పథకం ద్వారా రూ.24వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని ప్రధాని నరేంద్రమోదీ వెల్లడించారు. బిహార్‌లో నిర్వహించిన సభలో ప్రధాని పాల్గొని ప్రసంగించారు. ఆదివాసీలు తమ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.

గత ప్రభుత్వాలు వెనకబడిన వర్గాల సంక్షేమం గురించి ఎప్పుడూ ఆలోచించలేదని.. వారి అభివృద్ధి కోసం కృషి చేయలేదని ప్రధాని విమర్శించారు. సమాజానికి దూరంగా నివసిస్తున్న ఆదివాసీలకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. వారు పండించే దాదాపు 90 అటవీ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర ఇచ్చామన్నారు. ఆదివాసీ యువత క్రీడలలో ముఖ్యపాత్ర పోషిస్తున్నారని.. వారిని మరింత ప్రోత్సహించడానికి అనేక క్రీడా సౌకర్యాలను ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఆదీవాసీలకు చదువు, సంపద, వైద్య సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. వారి సంక్షేమానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేశామని.. బడ్జెట్‌ను రూ.25,000 కోట్ల నుంచి రూ.1.25 లక్షల కోట్లకు పెంచామని ప్రధాని వెల్లడించారు.