భారతదేశంలో 37.5 కోట్ల మంది ఎయిర్‌టెల్ యూజర్ల వ్యక్తిగత వివరాలు డార్క్ వెబ్‌లో అమ్మకానికి ఉందని ఓ హ్యాకర్ చేసిన ప్రకటన దేశవ్యాప్తంగా సంచనలంగా మారింది. దేశంలోనే అతిపెద్ద టెలికాసం సంస్థల్లో ఒకటైనా ఎయిర్‌టెల్ యూజర్ల డేటా లీక్ అయ్యిందన్న అందరినీ కలవరానికి గురి చేశాయి.
‘ఎక్స్‌జెన్’ అనే పేరుతో సదరు హ్యాకర్ 37.5 కోట్ల మంది ఎయిర్‌టెల్ ఇండియా యూజర్ల మొబైల్ నెంబర్లు, పుట్టిన తేదీ, తండ్రిపేరు, ఆధార్ కార్డు వివరాలు, ఈమెయిల్ ఐడీ వంటి వివరాలతో కూడా డేటా బేస్‌ను రూ. 41 లక్షలకు అమ్మకానికి పెట్టినట్లు ప్రకటించాడు. దీంతో దీనిపై ఎయిర్‌టెల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదంతా తప్పుడు ప్రచారమేనని కొట్టి పడేసింది. దీనిపై తాము క్షుణ్ణంగా దర్యాప్తు చేశామని, ఎయిర్‌టెల్ సిస్టమ్‌లో ఎలాంటి ఉల్లంఘన జరగలేదని తేల్చి చెప్పారు. ఇది ముమ్మాటికీ తప్పుడు ప్రచారమని, యూజర్లు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎయిర్ టెల్ తెలిపింది.
అయితే హ్యాకర్ మాత్రం జూన్‌లోనే ఈ డేటా లీక్ జరిగినట్లు చెబుతున్నాడు. డేటా నమూనాను కూడా షేర్ చేసినట్లు చెప్పాడు. అంతేకాకుండా కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ నిర్వహించే దౌత్యవేత్త పాస్‌పోర్ట్ హోల్డర్స్ డేటాబేస్‌ను లక్ష్యంగా చేసుకొని, గతంలో జరిగిన ఉల్లంఘనలో కూడా ఎక్స్‌జెన్ పాల్గొన్నట్లు పేర్కొన్నారు.