కేరళ రాష్ట్రం వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. మరికొంతమంది ప్రాణాలు కొల్పోయారు. బాధితులకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.6 లక్షల ఆర్థిక సాయం అందజేయనున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా బాధితులకు అద్దె సాయంగా రూ.6 వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు.
‘వయనాడ్ కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.6 లక్షల ఆర్థిక సాయం అందజేయనున్నాం. అదేవిధంగా బాధితులకు అద్దె సాయం కింద రూ.6 వేలు ఇవ్వనున్నాం. 60 శాతం గాయపడిన వారికి రూ.75,000, 40 నుంచి 50 శాతం గాయపడిన వారికి రూ.50 వేలు అందజేస్తాం. తీవ్రంగా గాయపడిన వారికి అదనంగా రూ.50 వేలు సాయంగా అందజేస్తాం. ముఖ్యమంత్రి విపత్తు సహాయ నిధి నుంచి ఈ నిధులు కేటాయిస్తాం’ అని సీఎం పినరయి విజయన్ వెల్లడించారు.