Thursday, October 10, 2024
Homeఅంతర్జాతీయంపేజ‌ర్‌కు లోకేష‌న్ ట్రాకింగ్ చేయ‌డం వీలు కాదు..

పేజ‌ర్‌కు లోకేష‌న్ ట్రాకింగ్ చేయ‌డం వీలు కాదు..

Date:

లెబ‌నాన్ దేశంలో పేజ‌ర్ పేల‌డం ప్ర‌పంచ‌వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది. ఎప్పుడో ఒక‌ప్పుడు వాడిన పేజ‌ర్ మ‌ళ్లీ ఇప్పుడు ఉప‌యోగిస్తున్నట్లు తెలుస్తోంది. పేజ‌ర్‌ను బీపర్ అని కూడా పిలుస్తారు, ఇది ఏదైనా సంక్షిప్త సందేశాలు స్వీకరించడానికి మరియు కొన్ని సందర్భాల్లో సంక్షిప్త సందేశాలు లేదా హెచ్చరికలను పంపడానికి రూపొందించబడిన చిన్న, పోర్టబుల్ ఎలక్ట్రానిక్ డివైజ్.

పేజర్ ఎందుకు ఉపయోగిస్తారు?

1990ల చివరలో మరియు 2000ల ప్రారంభంలో మొబైల్ వినియోగంలో రాకముందు పేజర్లు వినియోగించారు. తొందరగా మరియు విశ్వసనీయమైన కమ్యూనికేషన్‌కు అవసరమైన పనిచేసేవారికి ఈ టూల్ ఉపయోగపడుతుంది. దీంతో పేజర్ ఎంతో గుర్తింపు పొందింది. వైద్యులు, నర్సులు మరియు అత్యవసర సేవల సిబ్బంది సెల్యులార్ నెట్‌వర్క్‌లపై ఆధారపడకుండా ఉండేందుకు ఉపయోగిస్తారు.

పేజర్లు ఎన్ని రకాలు?

పేజర్లు ప్రధానంగా రెండు రకాలు….న్యూమరిక్ పేజర్స్‌లో కేవలం నంబర్స్ మాత్రమే కనిపిస్తాయి. ఏదైనా ఫోన్ నంబర్‌కు కాల్ చేయమని లేదా పేజ్‌కు స్పందించమని మెసేజ్ వస్తుంది. న్యూమరిక్ పేజర్స్ అనేది బేసిక్ టైప్ పేజర్. ఆల్ఫాన్యూమరిక్ పేజర్స్…కేవలం లెటర్స్ మరియు నంబర్స్ మరియు టెక్స్ట్ కమ్యూనికేషన్స్ ఉంటాయి. మొబైల్ ఫోన్‌లతో పోలిస్తే పేజర్‌లు సాధారణంగా ఎక్కువ కవరేజ్ ఏరియాను కలిగి ఉంది, ముఖ్యంగా సెల్యులార్ సిగ్నల్‌లు వీక్‌గా ఉండే మారుమూల ప్రాంతాలలో మరియు అందువల్ల ఇవి ఎంతో నమ్మకమైనవి. ప్రస్తుతం ఈ పేజర్లను చాలా తక్కువ మంది ఉపయోగిస్తున్నారు. పేజర్లను లిథియం బ్యాటరీలతో రూపొందిస్తారు. లిథియం బ్యాటరీలు వేడెక్కగల సామర్థ్యాన్ని కల్గి ఉంటుంది. ఇవి వేడి చేయడం వల్ల లిథియం బ్యాటరీ కరిగి పేలిపోయి మంటలు వ్యాపించే అవకాశం ఉంటుంది.

లెబనాన్‌లో వాడ‌డానికి కార‌ణం

టెక్నాలజీ ఎంతో పెరిగినప్పటికీ ఇప్పటికీ లెబనాన్‌లో హిజ్బుల్లా గ్రూప్‌ పేజర్స్‌నే వినియోగిస్తున్నారు. తక్కువ టెక్నాలజీ ఉన్నటువంటి పేజర్స్ వినియోగం వల్ల వారి లోకేషన్ ట్రాకింగ్ చేయడం వీలు కాదు. పలు మీడియా కథనాల ప్రకారం సుమారుగా 5వేల పేజర్స్ పేలుళ్లు జరిగాయి.