Saturday, December 7, 2024
Homeఅంతర్జాతీయంబ్రూన్ సుల్తాన్‌కు 7000 ల‌గ్ల‌రీ కార్లు

బ్రూన్ సుల్తాన్‌కు 7000 ల‌గ్ల‌రీ కార్లు

Date:

బ్రూనే సుల్తాన్ హ‌స్స‌నాల్ బోల్కియా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి స్వాగ‌తం ప‌ల‌క‌నున్నారు. రెండు దేశాల మ‌ధ్య ఉన్న 40 ఏళ్ల దౌత్య సంబంధాల‌ను బ‌లోపేతం చేయ‌నున్నారు. ప్ర‌పంచంలోని సంప‌న్న వ్య‌క్తుల్లో బోల్కియా ఒక‌రు. ఆయ‌న చాలా విలాస‌వంత‌మైన జీవితాన్ని గ‌డుపుతారు. ఆయ‌న వ‌ద్ద అత్య‌ధిక సంఖ్య‌లో ఖ‌రీదైన కార్లు ఉన్నాయి. సుమారు 5 బిలియ‌న్ల డాల‌ర్ల ఖ‌రీదైన ల‌గ్జ‌రీ కార్లు ఉన్న‌ట్లు తెలుస్తోంది. బ్రూనే ఇంధ‌న‌, గ్యాస్ రిజ‌ర్వ్‌ల నుంచి ఆయ‌న సుమారు 30 బిలియ‌న్ల డాల‌ర్లు సంపాదించారు. సుల్తాన్ బ‌ల్కియా వ‌ద్ద సుమారు ఏడు వేల ల‌గ్జ‌రీ వాహ‌నాలు ఉన్నాయి. వాటిల్లో 600 రోల్స్ రాయిస్ కార్లు ఉన్నాయి. ఆయ‌న పేరిట గిన్నిస్ వ‌ర‌ల్డ్ రికార్డు ఉంది. బోల్కియా క‌లెక్ష‌న్‌లో 450 ఫెరారీలు, 380 బెంట్లీ కార్లు కూడా ఉన్నాయి. పోర్షె, లాంబోర్గిని, మేబాచ్‌, జాగ్వార్‌, బీఎండ‌బ్ల్యూ, మెక్‌లారెన్ కార్లు కూడా అత‌ని వ‌ద్ద ఉన్నాయి.

సుల్తాన్ బోల్కియా క‌లెక్ష‌న్‌లో బెంట్లీ డామినేట‌ర్ ఎస్‌యూవీ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తున్న‌ది దాని విలువ సుమారు 80 మిలియ‌న్ల డాల‌ర్లు. పోర్షె 911 హారిజ‌న్ బ్లూ, 24 క్యారెట్ల గోల్డ్ ప్లేట్ రోల్స్ రాయిస్ సిల్వ‌ర్ స్ప‌ర్‌-2 కార్లు ఉన్నాయి. క‌స్ట‌మ్ డిజైన్డ్ రోల్స్ రాయిస్ విత్ ఓపెన్ రూఫ్ కారు కూడా ఉంది. కూతురు, యువ‌రాణి మ‌జేదేదా పెళ్లి కోసం 2007లో గోల్డ్ కోటింగ్ రోల్స్ రాయిస్ కారును ఆయ‌న ఖ‌రీదు చేశారు. ఇస్తానా నూరుల్ ఇమాన్ ప్యాలెస్‌లో సుల్తాన్ బోల్కియా నివాసం ఉంటున్నారు. అతిపెద్ద రెసిడెన్షియ‌ల్ ప్యాలెస్‌గా ఆ భ‌వంతికి గిన్నిస్ వ‌ర‌ల్డ్ రికార్డులో చోటు ద‌క్కింది. సుమారు 20 ల‌క్ష‌ల చ‌ద‌ర‌పు అడుగులు ఆ ప్యాలెస్ ఉంటుంది. 22 క్యారెట్ల బంగారంతో ఆ భ‌వంతిని దీర్చిదిద్దారు. బ్రూనే సుల్తాన్ ప్యాలెస్‌లో అయిదు స్విమ్మింగ్ పూల్స్, 1700 బెడ్ రూమ్స్‌, 257 బాత్ రూమ్‌లు, 110 గ్యారేజీలు ఉన్నాయి. ఆ సుల్తాన్‌కు ప్రైవేటు జూ కూడా ఉన్న‌ది. దాంట్లో 30 బెంగాలీ టైగ‌ర్లు, ర‌క‌ర‌కాల ప‌క్షి జాతులు, బోయింగ్ 747 విమానం ఉన్న‌ది.