610 కిలోల నుంచి 60కేజీల‌కు త‌గ్గాడు

Date:

మ‌నిషికి ఊబ‌కాయం ఉంటే ఏ పని చేయ‌డానికి ఆస‌క్తి ఉండ‌దు.. ఊబకాయం మ‌నిషిని మ‌రింత సోమ‌రిపోతుగా మార్చివేస్తోంది. అలాంటిది ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యధిక బరువున్న వ్యక్తిగా వార్తల్లో నిలిచిన వ్యక్తి ఏకంగా 542 కేజీల బరువు తగ్గిపోయాడు. 610 కిలోల నుంచి 60కేజీల‌కు త‌గ్గాడు. ఓ రాజు అందించిన సహకారం ఆ వ్యక్తి పాలిట వరమైంది. మీడియా కథనాల ప్రకారం..

సౌదీ అరేబియాకు చెందిన ఖలీద్‌ బిన్ మొహసేన్ షారీ.. భారీ దేహంతో నానా అవస్థలు పడేవాడు. 2013లో 610 కేజీల బరువు పెరిగాడు. దాంతో మూడేళ్లపాటు మంచానికే పరిమితం కావాల్సి వచ్చింది. తన పనులు కూడా చేసుకోలేని పరిస్థితికి దిగజారిపోయాడు. ఖలీద్‌ స్టోరీ విన్న మునుపటి సౌదీ రాజు అబ్దుల్లా.. అతడి ప్రాణాలు కాపాడాలని నిర్ణయించుకున్నాడు. తన సొంత డబ్బుతో ఖలీద్‌కు వైద్య సేవలు అందించడం ప్రారంభించారు. ప్రత్యేకంగా ఒక బెడ్ డిజైన్ చేయించారు. అలాగే అతడిని రియాద్‌లోని కింగ్‌ ఫాహద్ మెడికల్ సిటీకి తరలించారు. 30 మంది వైద్యులు ఎప్పటికప్పుడు అతడికి చికిత్స అందిస్తూ..ఒక డైట్ ఛార్ట్‌ను సిద్ధం చేశారు.

గ్యాస్ట్రిక్ బైపాప్ సర్జరీ చేశారు. శరీరంలో కదలికలను పునరుద్ధరించేందుకు వ్యాయామాలు చేయించేవారు. ఫిజియోథెరపీ నిర్వహించేవారు. దాంతో ఆరు నెలల్లో సగానికి సగం బరువు తగ్గాడు. ఇక 2023లో 542 కేజీలు తగ్గి అందర్నీ ఆశ్చర్యపర్చాడు. దాంతో 600 కేజీలున్న వ్యక్తి కాస్తా 60 కేజీల ఆరోగ్యవంతుడిగా మారిపోయాడు. అదనపు చర్మం తొలగింపు కోసం శస్త్ర చికిత్సలు అవసరమయ్యాయి. సరికొత్త రూపు సంతరించుకున్న ఆయన్ని ఇప్పుడు అంతా స్మైలింగ్ మ్యాన్‌ అంటూ పిలుస్తున్నారు. భారీకాయుడైన ఖలీద్‌.. నాజూకు వ్యక్తిగా మారిన క్రమాన్ని గమనించిన వైద్య సిబ్బంది ఆయనకు ఆ పేరుపెట్టారు.

Share post:

Popular

More like this
Related

ట్రైనీ డాక్ట‌ర్ శ‌వ‌ప‌రీక్ష కీల‌క‌పత్రం మిస్సింగ్‌

ప‌శ్చిమ‌బెంగాల్ కోల్‌కతా ట్రైనీ డాక్టర్‌ శవపరీక్షకు సంబంధించిన కీలక పత్రం మిస్‌...

డాక్ట‌ర్ల నిర‌స‌న వ‌ల్ల 23మంది రోగులు మృతి

ప‌శ్చిమ‌బెంగాల్ కోల్‌క‌తాలో జూనియ‌ర్ వైద్యురాలిపై జ‌రిగిన అత్యాచారం, హ‌త్య‌పై ప‌శ్చిమ బెంగాల్‌తో...

నిర్మాణంలో ఉన్న ఇళ్లను మాత్ర‌మే కూల్చుతున్నాం

ఎఫ్‌టీఎల్‌, బ‌ఫ‌ర్‌జోన్‌లోకి వ‌చ్చే నిర్మాణ ద‌శ‌లో ఉన్న ఇళ్ల‌ను మాత్ర‌మే కూలుస్తున్నామ‌ని...

ఎవ‌రికి అర్థం కాని మందులు రాసిన వైద్యుడు

పెషేంట్ల‌కు వైద్యులు రాసే మందులు అర్థ‌మ‌య్యే విధంగా ఉండాల‌ని ప్ర‌భుత్వ నిబంధ‌న‌లు...