Tuesday, October 15, 2024
Homeఅంతర్జాతీయంహెజ్‌బొల్లా మరో కీలక నేత హతం

హెజ్‌బొల్లా మరో కీలక నేత హతం

Date:

ఇజ్రాయెల్‌ ఆదివారం జరిపిన వైమానిక దాడుల్లో హెజ్‌బొల్లాకు చెందిన మరో కీలక నేత నబిల్‌ కౌక్‌ హతమయ్యాడు. హెజ్‌బొల్లా సెంట్రల్‌ కౌన్సిల్‌లో డిప్యూటీ హెడ్‌గా ఉన్న నబిల్‌ మృతిచెందినట్లు ఇజ్రాయెల్‌ సైన్యం వెల్లడించింది. అయితే, దీనిపై హెజ్‌బొల్లా నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

గత కొన్ని వారాలుగా లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ కొనసాగిస్తోన్న భీకరదాడుల్లో హెజ్‌బొల్లాకు చెందిన పలువురు సీనియర్‌ కమాండర్లు హతమైన విషయం తెలిసిందే. శుక్రవారం జరిగిన దాడిలో హెజ్‌బొల్లా అధినేత హసన్‌ నస్రల్లా (64) మృతి చెందడం ఆ గ్రూపునకు శరాఘతంలా మారింది. ఈ తరుణంలోనే మరో కీలక నేతను కోల్పోవడం గమనార్హం. నబిల్‌ 1995 నుంచి 2010 వరకు సౌత్‌ లెబనాన్‌లోని హెజ్‌బొల్లా మిలటరీ కమాండర్‌గా పనిచేశాడు. 2020లో అతడిపై అమెరికా ఆంక్షలు విధించింది.