సామాజిక మాధ్యమం ఎక్స్ సేవలు బ్రెజిల్‌లో నిలిచిపోయాయి. ఆ దేశ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆదేశాల మేరకు టెలికామ్ విభాగం ఈ చర్యలు తీసుకొన్నట్లు ఓ ఆంగ్ల వార్తా సంస్థ తెలిపింది. దీంతో ఇక్కడి ప్రజలకు ఎక్స్‌లోకి లాగిన్ అవడం సాధ్యం కావడం లేదు. బ్రౌజర్‌ను రీలోడ్ చేసి లాగిన్ అవ్వండి అంటూ పదేపదే సందేశాలు కనిపిస్తున్నాయి.
తమ దేశంలో బ్రెజిల్‌లో ఎక్స్ ఎటువంటి న్యాయ ప్రతినిధిని నియమించలేదు. దీంతో అక్కడి సుప్రీంకోర్టు న్యాయమూర్తి అలెగ్జాండర్ డె మోరాసే తక్షణమే ఎక్స్‌ను 24 గంటల్లో ఆపేయమని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ వివాదం మొత్తం ఏప్రిల్‌లో మొదలైంది. దేశంలో తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్న పలు ఎక్స్ ఖాతాలను తొలగించాలని న్యాయస్థానం ఆదేశించడం వివాదానికి బీజం వేసింది.