Saturday, December 7, 2024
Homeఅంతర్జాతీయంబంగ్లా మాజీ ప్రధాని షేక్‌ హసీనా అరెస్ట్‌కు వారెంట్‌..

బంగ్లా మాజీ ప్రధాని షేక్‌ హసీనా అరెస్ట్‌కు వారెంట్‌..

Date:

బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనాకు బంగ్లాదేశ్ ఇంటర్నేషన్‌ క్రైమ్‌ ట్రైబ్యునల్‌ గురువారం అరెస్ట్‌ వారెంట్లు జారీ చేసింది. హ‌సీనాతో పాటు అరెస్టు వారెంట్లు జారీ అయిన వారిలో అవామీ లీగ్‌కు చెందిన పలువురు నాయకులు సైతం ఉన్నారు. విద్యార్థుల ఉద్యమం నేపథ్యంలో జరిగిన మారణహోమం, ఇతర నేరారోపణలపై క్రైమ్‌ ట్రైబ్యునల్‌లో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ మేరకు నిందితులను అరెస్ట్‌ చేయాలని కోరుతూ ప్రాసిక్యూషన్‌ దాఖలు చేసిన రెండు పిటిషన్లపై జస్టిస్ మహ్మద్ గోలం ముర్తాజా మజుందార్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయాన్ని చీఫ్ ప్రాసిక్యూటర్ మహ్మద్ తాజుల్ ఇస్లాం వెల్లడించారు. నవంబర్ 18లోగా షేక్ హసీనా సహా మొత్తం 46 మందిని అరెస్ట్ చేసి హాజరుపరచాలని ధర్మాసనం అధికారులను ఆదేశించింది.