నా గ్రామానికి రోడ్డు లేదు.. రోడ్డు వెయ్యండి..

Date:

పాక్ ప్రభుత్వానికి అర్షద్‌ నదీమ్‌ తన గ్రామం కోసం ఓ విజ్ఞప్తి చేశాడు. గ్రామస్థుల సహకారంతో అంతర్జాతీయ స్థాయికి వెళ్లిన నదీమ్‌ వారికోసం ఏదైనా చేయాలని సంకల్పించాడు. ”మా గ్రామంలో రోడ్లు వేయాల్సిన అవసరం ఉంది. వంట గ్యాస్‌ సరఫరా కూడా సరిగా లేదు. ఆ సదుపాయం కల్పిస్తే నాతోపాటు మా గ్రామానికి చాలా ఉపయోగం. మియాన్ చాన్నులో ఓ యూనివర్సిటీ రావాలనేది నా కల. మా సోదరీమణులు వేరే సిటీకి వెళ్లి చదువుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. ముల్తాన్‌కు వెళ్లాలంటే కనీసం రెండు గంటలపాటు ప్రయాణించాలి. అదే ఒక యూనివర్సిటీ మాకు దగ్గరగా ఉంటే చాలామంది గ్రామీణులకు ఉపయోగకరం. క్రీడాకారులకు మద్దతుగా నిలుస్తున్న పాక్‌ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతున్నా. గ్రామంలోని ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు. ఈ విజయం వెనుక వారందరి పాత్ర ఉంది. ఈవెంట్ల కోసం వెళ్లేందుకు సహకారం అందించారు. తప్పకుండా గ్రామస్థుల రుణం తీర్చుకొనేందుకు ప్రయత్నిస్తా” అని నదీమ్‌ వ్యాఖ్యానించాడు. పారిస్‌ నుంచి స్వదేశానికి చేరుకున్న అతడికి ఘన స్వాగతం లభించింది. ఈ ఒలింపిక్స్‌లో పాక్‌కు ఒకే ఒక్క పతకం వచ్చింది. అదీ కూడా నదీమ్‌ సాధించిన గోల్డ్‌ మెడలే.

Share post:

Popular

More like this
Related

ట్రైనీ డాక్ట‌ర్ శ‌వ‌ప‌రీక్ష కీల‌క‌పత్రం మిస్సింగ్‌

ప‌శ్చిమ‌బెంగాల్ కోల్‌కతా ట్రైనీ డాక్టర్‌ శవపరీక్షకు సంబంధించిన కీలక పత్రం మిస్‌...

డాక్ట‌ర్ల నిర‌స‌న వ‌ల్ల 23మంది రోగులు మృతి

ప‌శ్చిమ‌బెంగాల్ కోల్‌క‌తాలో జూనియ‌ర్ వైద్యురాలిపై జ‌రిగిన అత్యాచారం, హ‌త్య‌పై ప‌శ్చిమ బెంగాల్‌తో...

నిర్మాణంలో ఉన్న ఇళ్లను మాత్ర‌మే కూల్చుతున్నాం

ఎఫ్‌టీఎల్‌, బ‌ఫ‌ర్‌జోన్‌లోకి వ‌చ్చే నిర్మాణ ద‌శ‌లో ఉన్న ఇళ్ల‌ను మాత్ర‌మే కూలుస్తున్నామ‌ని...

ఎవ‌రికి అర్థం కాని మందులు రాసిన వైద్యుడు

పెషేంట్ల‌కు వైద్యులు రాసే మందులు అర్థ‌మ‌య్యే విధంగా ఉండాల‌ని ప్ర‌భుత్వ నిబంధ‌న‌లు...