Saturday, December 7, 2024
Homeఅంతర్జాతీయంచిన్నారుల వేధింపుల నిరోధానికి స‌హ‌క‌రించ‌ని ఎక్స్‌

చిన్నారుల వేధింపుల నిరోధానికి స‌హ‌క‌రించ‌ని ఎక్స్‌

Date:

సామాజిక మాధ్యమం ఎక్స్‌ చిన్నారులపై వేధింపుల నిరోధానికి సహకరించడంలేదని ఆస్ట్రేలియా న్యాయస్థానం చర్యలు తీసుకొంది. ఆ సంస్థకు విధించిన జరిమానాను సమర్థించింది. చిన్నారులపై వేధింపుల నిరోధానికి ఎక్స్‌ ఏం చర్యలు తీసుకుంటుందో వెల్లడించాలని ఆస్ట్రేలియాలోని ఇ-సేఫ్టీ కమిషనర్‌ కోరారు. కానీ, వాటిని అందించడంలో ఆ సంస్థ విఫలమైంది. దీనిపై దిగువ న్యాయస్థానం సదరు సామాజిక మాధ్యమానికి 6,10,500 ఆస్ట్రేలియా డాలర్ల జరిమానా విధించింది. దీనిపై ఫెడరల్‌ కోర్ట్‌ ఆఫ్‌ ఆస్ట్రేలియాలో ఎక్స్‌ దరఖాస్తు చేసుకొంది. ఈ అంశంపై కోర్టు న్యాయమూర్తి స్పందిస్తూ.. నియంత్రణ సంస్థలు కోరిన సమాచారం ఇచ్చి తీరాలన్నారు. 2023 మొదట్లో తమ సంస్థ మస్క్‌ ఆధీనంలోకి వెళ్లిపోయిందని.. అందుకే తమకు పాత అంశాలపై బాధ్యతలుండవని ఎక్స్‌ వాదించింది.

విదేశీ కంపెనీలు విలీనాల తర్వాత ఆస్ట్రేలియా పరిధిలోని బాధ్యతలను తప్పించుకునేలా ఈవాదన ఉన్నట్లు ఇ- సేఫ్టీ కమిషనర్‌ న్యాయస్థానం తీర్పు తర్వాత పేర్కొన్నారు. తాము ఆ సంస్థపై సివిల్‌ ప్రొసీడింగ్స్‌ కూడా చేపడతామని వెల్లడించారు. దీనిపై ఎక్స్‌ వెంటనే స్పందించలేదు.