సింగపూర్‌లో ఒక సీనియర్ మాజీ క్యాబినెట్ మంత్రి సుబ్రమణియం ఈశ్వరన్‌కు ఓ కేసులో 12 నెలల జైలుశిక్ష పడింది. ప్రభుత్వంలో ఉన్న సమయంలో గిఫ్ట్‌లు స్వీకరించినట్లు 62 ఏళ్ల ఈశ్వరన్ కోర్టులో అంగీకరించారు. సుమారు 4 లక్షల డాలర్ల విలువైన బహుమతుల్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫార్ములా వన్ గ్రాండ్ ప్రి, బ్రాంప్టన్ టీలైన్ బైస్కిల్, మద్యం, ప్రైవేటు విమానంలో ప్రయాణం లాంటి గిఫ్ట్స్‌ను స్వీకరించినట్లు నిర్ధారించారు. సింగపూర్ హైకోర్టులో జస్టిస్ విన్సెంట్ హూంగ్ ఈ కేసులో తీర్పునిచ్చారు. రవాణాశాఖ మాజీ మంత్రిగా చేసిన సుబ్రమణియం.. అధికారాన్ని దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అక్టోబర్ 7వ తేదీన మంత్రి ఈశ్వరన్ జైలులో లొంగిపోనున్నారు. గత 50 ఏళ్లలో జైలుశిక్ష పడిన రాజకీయవేత్తగా మంత్రి ఈశ్వరన్ నిలిచారు.