Thursday, October 10, 2024
Homeఅంతర్జాతీయంకిమ్ పరిపాలనలో భార్యకు కూడా ఎన్నో రూల్స్..!

కిమ్ పరిపాలనలో భార్యకు కూడా ఎన్నో రూల్స్..!

Date:

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ అక్కడి ప్రజలకు మాత్రమే కాదు, తన భార్యకు కూడా ఎన్నో రూల్స్ పెట్టాడు. కిమ్ భార్య మంచి గాయని, చీర్ లీడర్. అయితే ఆమెను కిమ్ తండ్రి, నియంత కిమ్ జంగ్ ఇల్ ఓ కార్యక్రమంలో చూశాడు. 2008లో గుండె నొప్పితో బాధపడుతున్న ఇల్.. రిసోల్‌ను పెళ్లి చేసుకోవాలని కిమ్‌ని ఆదేశించాడు.

దాంతో కిమ్ 2009లో ఆమెను బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని మీడియాలో కథనాలు వచ్చాయి. అంతేకాదు పెళ్లి తర్వాత కిమ్ తన భార్య పేరు కూడా మార్చేశాడట. పెళ్లయిన నాటి నుంచి ఇప్పటి వరకు ఆమెను తన తల్లిదండ్రులతో కూడా కలవనివ్వలేదట. చివరికి ఆమె వేసుకునే దుస్తుల విషయంలో కూడా ఆమెకు స్వేచ్ఛ లేదట. అతనికి నచ్చిన దుస్తులే వేసుకోవాలట. అంతేకాదు హెయిర్ స్టైల్ కూడా కిమ్‌కు నచ్చినట్టే ఉండాలట. ఆమె ఒంటరిగా బయటకు వెళ్లడానికి అనుమతి లేదట.

కేవలం తనతో మాత్రమే ఆమె ఇంటి నుంచి బయట అడుగుపెట్టాలట. కిమ్‌ దంపతులకు 2010లో మొదటి బిడ్డ జన్మించింది. ఆ తర్వాత కొన్నేళ్లకు మరో బిడ్డ జన్మించింది. ఇలా ఇద్దరూ ఆడపిల్లలే పుట్టడంతో కిమ్ సంతోషంగా లేడట. మగ బిడ్డ జన్మించే వరకు పిల్లలను కనాల్సిందేనని భార్యను ఆదేశించాడట. ఈ క్రమంలో ఇటీవల కిమ్‌ భార్య మరో బిడ్డను కన్నది. అయితే ఆ బిడ్డ ఆడబిడ్డా, మగబిడ్డా అనే విషయం ఇంకా బయటికి రాలేదు. కానీ మగ బిడ్డ జన్మించినట్లు కొన్ని మీడియా సంస్థలు చెబుతున్నాయి.

కట్టుకున్న భార్యపట్ల కూడా ఇంత కఠినంగా వ్యవహరించే కిమ్‌ పాలనలో సామాన్య ప్రజలకు సంతోషం ఉంటుందా..? అంత భయంకర పరిస్థితుల్లో ఎవరైనా స్వేచ్ఛగా జీవించగలరా..? అందుకే ఉత్తరకొరియా అంటే అదో ప్రత్యేక ప్రపంచం. ప్రపంచంలోని అన్ని దేశాలు వేరు, ఆ ఒక్క దేశం వేరు. ఆ దేశ అధ్యక్షుడి కర్ణకఠోర నియంతృత్వ ధోరణే అందుకు కారణం.