పాకిస్తాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ పారిస్ ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రోలో గోల్డ్ మెడల్ సాధించారు. 92.97 మీటర్లతో ఒలింపిక్ రికార్డును బద్ధలుకొట్టి, ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయ్యారు. నదీమ్‌కు చాలా బహుమతులు అందుతున్నాయి. తాజాగా నదీమ్‌కు తన మామ మహ్మద్ నవాజ్ ఒక స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడు. స్థానిక సంప్రదాయం ప్రకారం.. తమ గ్రామంలో గౌరవానికి చిహ్నంగా భావించే గేదెను బహుమతిగా ఇచ్చాడు. ఇలాంటి బహుమతికి తమ సంప్రదాయాల్లో చాలా ప్రాముఖ్యత ఉందని నవాజ్ తెలిపారు.
గ్రామీణ పంజాబ్‌లోని ఓ పేద కుటుంలో అర్హద్ నదీమ్ జన్మించాడు. మట్టి, ఇటుకతో నిర్మించిన ఇంట్లో పెరిగాడు. సరైన వసతులు, ఆహారం లేని రోజుల నుంచి ఒలింపిక్ పతక విజేత వరకు అర్హద్ నదీమ్ ప్రయాణం అద్భుతం. ఈ ప్రయాణం స్ఫూర్తినే కాదు పాకిస్థాన్‌లో ఉన్న క్రీడా సౌకర్యాలపై కూడా స్పష్టతను ఇస్తుంది. పరిమిత వనరుల కారణంగా గోధుమ పొలాల్లో ఇంట్లో తయారు చేసిన జావెలిన్‌లతో నదీమ్ శిక్షణ పొందాడు. క్రికెట్‌కి తప్ప మరో క్రీడకు పాకిస్థాన్‌లో ఆదరణ లేదని నదీమ్ చేసిన వ్యాఖ్యలు ఆ దేశ పరిస్థితికి అద్దం పడుతాయి. జావెలిన్ త్రోలో అతడు సాధించిన విజయంతో పాక్‌లో ఇతర క్రీడలకు మద్దతు పెరుగుతుందని అందరూ ఆశిస్తున్నారు.
*రెండో అత్యున్నత పురస్కారం
అర్హద్ నదీమ్ అత్యత్తమ విజయానికి పాకిస్థాన్ రెండో అత్యున్నత పురస్కారం హిలాల్-ఇ-ఇమ్తియాజ్ అందుకోనున్నాడు. పాక్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ నదీమ్‌కి పురస్కారం ఇస్తున్నట్లు ప్రకటించారు.