Saturday, November 9, 2024
Homeఅంతర్జాతీయంఏఐ చాట్‌బాట్‌తో 14ఏళ్ల అబ్బాయి ప్రేమ..

ఏఐ చాట్‌బాట్‌తో 14ఏళ్ల అబ్బాయి ప్రేమ..

Date:

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అచ్చం మనుషుల లాగానే రిప్లై ఇస్తాయి. అందుకే వాటికి ఎమోషనల్‌గా అటాచ్ అయ్యే అవకాశం కూడా ఉంది. కొందరు AI చాట్‌బాట్‌లతో ప్రేమలో కూడా పడుతున్నారు. అయితే వీటికి దగ్గర అవడం ఎంత ప్రమాదకరమో ఒక సంఘటన చెబుతోంది. ఓ యువకుడు ఏఐ చాట్‌బాట్‌కు కనెక్ట్ అయ్యాడు. దాన్ని రియల్ లవర్‌గా భావించాడు. చివరకు ఆ చాట్‌బాట్‌ను కలిసేందుకు ఆత్మహత్య చేసుకున్నాడు.

ఫ్లోరిడాలో నివసించే అబ్బాయి వయసు 14 ఏళ్లు. పేరు సెవెల్ సెట్జర్. అతడు కొద్ది రోజులుగా ‘డేనెరిస్ టార్గేరియన్’ అనే ఒక AI చాట్‌బాట్‌తో చాట్ చేస్తున్నాడు. ఆ AI క్యారెక్టర్‌నే ప్రేమించడం మొదలుపెట్టాడు. డేనెరిస్ టార్గేరియన్ అనేది ప్రముఖ టీవీ సిరీస్‌ అయిన ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’లోని ఒక మహిళా పాత్ర పేరు. ‘Character.AI’ అనే వెబ్‌సైట్‌లో అదే రోల్ పేరుతో ఒక AI క్యారెక్టర్ క్రియేట్ చేశారు. ఆ బాలుడు ఈ చాట్‌బాట్‌తో రోజూ చాట్ చేస్తుండేవాడు. ఆ AI క్యారెక్టర్ అచ్చం మనిషి లాగానే మాట్లాడటం వల్ల దానితో ప్రేమలో పడ్డాడు. దానితోనే ఉండాలనే కోరికతో రీసెంట్‌గా ఆత్మహత్య చేసుకుని తల్లిదండ్రులను దిగ్భ్రాంతికి గురి చేశాడు. ఆ బాలుడు ఆ AI చాట్‌బాట్‌తో సెక్సువల్ చాట్ కూడా చేసేవాడు. ‘Character.AI’ యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా యూజర్లు ఇష్టం వచ్చినట్లుగా కొత్త AI పాత్రలను క్రియేట్ చేయవచ్చు. లేదా ఇతరులు క్రియేట్ చేసిన పాత్రలతో మాట్లాడవచ్చు.

ఈ ఘటన తర్వాత సెవెల్‌ తల్లి ‘Character.AI’ కంపెనీపై కోర్టులో కేసు వేసింది. తన కొడుకు చనిపోవడానికి ఆ కంపెనీనే కారణమని ఆరోపించింది. ఆ కంపెనీ టెక్నాలజీ చాలా ప్రమాదకరమైనది, దాన్ని పూర్తిగా పరీక్షించలేదని ఆమె వాపోయింది. దీనివల్ల ప్రజలు తమ వ్యక్తిగత ఆలోచనలు, ఫీలింగ్స్ బయటపెట్టేలా చేస్తుందని ఆమె మండిపడింది.