Saturday, December 7, 2024
Homeఅంతర్జాతీయంఉక్రెయిన్‌పై 90క్షిప‌ణులు, 100డ్రోన్ల‌తో దాడి

ఉక్రెయిన్‌పై 90క్షిప‌ణులు, 100డ్రోన్ల‌తో దాడి

Date:

ఉక్రెయిన్‌పై ర‌ష్యా బుధ‌వారం రాత్రి విరుచుకుప‌డింది. సుమారు 90 క్షిప‌ణులు, 100 డ్రోన్ల‌తో .. గ‌త రాత్రి ఉక్రెయిన్‌పై దాడి చేశామ‌ని ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. బ్రిట‌న్‌, అమెరికా ఆయుధాల‌తో ఉక్రెయిన్ దాడి చేసిన నేప‌థ్యంలో.. తాము ప్ర‌తిదాడికి దిగిన‌ట్లు పుతిన్ వెల్ల‌డించారు. ఉక్రెయిన్‌లో టార్గెట్ల‌ను సెలెక్ట్ చేసుకుని దాడి చేస్తున్న‌ట్లు చెప్పారు. అయితే ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్‌స్కీ కూడా ఈ విష‌యాన్ని అంగీక‌రించారు.

క్షిప‌ణులు, డ్రోన్ల‌తో ర‌ష్యా దాడి చేసిన‌ట్లు ఆయ‌న ఒప్పుకున్నారు. లుట‌స్కీ, వోలిన్ ప‌ట్ట‌ణాల‌పై భీక‌ర దాడి జ‌రిగింది. ధ్వంస‌మైన ప్ర‌దేశ‌ల్లో ఫైర్‌ఫైట‌ర్లు స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌డుతున్నారు. ఎన‌ర్జీ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్‌ను టార్గెట్ చేయ‌డం వ‌ల్ల వోలిన్ ప్రాంతంలో సుమారు రెండు ల‌క్ష‌ల మంది విద్యుత్తు స‌ర‌ఫ‌రాకు దూరం అయ్యారు. కొత్త‌గా డెవ‌ల‌ప్ చేసిన ఓరెష్నిక్ బాలిస్టిక్ క్షిప‌ణితో ఉక్రెయిన్‌పై దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు కూడా పుతిన్ స్ప‌ష్టం చేశారు. ప్ర‌స్తుతం భారీ సంఖ్య‌లో ఆ క్షిప‌ణుల‌ను ర‌ష్యా త‌యారు చేస్తున్న‌ది. అణు సామ‌ర్థ్యం క‌లిగిన ఆ క్షిప‌ణి.. ధ్వ‌ని క‌న్నా 10 రెట్ల అధిక వేగంతో ప్ర‌యాణించ‌గ‌ల‌దు.