Saturday, December 7, 2024
Homeఅంతర్జాతీయంఅణ్యాయుధాల వినియోగంపై పుతిన్ సంత‌కం

అణ్యాయుధాల వినియోగంపై పుతిన్ సంత‌కం

Date:

అణ్వాయుధాల వినియోగానికి అనుమతించే నిబంధనలను మరింత సరళతరం చేసే కీలక దస్త్రంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ సంతకం చేశారు. అణ్వాయుధాలు కలిగి ఉన్న దేశం సాయంతో ఏ దేశమైనా తమపై దాడి చేస్తే.. దాన్ని సంయుక్త దాడిగానే పరిగణిస్తామని అందులో పేర్కొన్నారు. తాము అందించే దీర్ఘశ్రేణి క్షిపణులను రష్యా భూభాగంపైకి ప్రయోగించేందుకు ఉక్రెయిన్‌కు అమెరికా అనుమతించిన వేళ పుతిన్‌ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.

రష్యాపై దీర్ఘశ్రేణి ఆయుధాల వినియోగానికి పశ్చిమ దేశాలు ఆమోదం తెలిపితే… నాటో, అమెరికా, ఐరోపా దేశాలు నేరుగా యుద్ధంలో పాల్గొన్నట్లే భావిస్తామని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ కొన్ని రోజుల క్రితం పేర్కొన్నారు. నాటో సైనిక, సాయుధ సంపత్తిని లక్ష్యంగా చేసుకొని తాము కూడా దాడులు చేస్తామని హెచ్చరించారు. ఇందుకోసం విభిన్నమైన వ్యూహాలను సిద్ధం చేసుకున్నామన్నారు. ఈ క్రమంలో ఇప్పటికే తన అణు విధానానికి సవరణలు చేసిన రష్యా.. తాజాగా దానిని మరింత సరళతరం చేస్తూ నిర్ణయం తీసుకంది. ఒకవేళ పశ్చిమదేశాలు నేరుగా దాడి చేస్తే.. అణ్వాయుధాలు వాడటానికి వీలుగా నిబంధనలు సవరించినట్లు సమాచారం.