Saturday, December 7, 2024
Homeఆధ్యాత్మికంకారు డ్యాష్ బోర్డుపై దేవ‌త‌ల విగ్ర‌హాలు పెట్టొచ్చా..

కారు డ్యాష్ బోర్డుపై దేవ‌త‌ల విగ్ర‌హాలు పెట్టొచ్చా..

Date:

భార‌త‌దేశం ఆచార‌, సంప్ర‌దాయాల‌కు పెట్టింది పేరు. పురాత‌న ఆచారాల‌ను ఇప్ప‌టికి చాలామంది న‌మ్ముతుంటారు. వాటితో పాటు భారతీయులకు, ఆధ్యాత్మికతకు విడదీయరాని సంబంధం ఉంటుంది. అయితే కొందరికి భక్తి భావం మరీ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వారు ఏ పని ప్రారంభించినా సరే, దేవుళ్లు, దేవతలను తలచుకుంటారు. చేసే పని సక్సెస్ అవ్వాలని కోరుకుంటారు. మరికొందరు దేవతల ప్రతిమలు, పటాలను కారు డ్యాష్‌బోర్డ్‌పై పెడతారు. ప్రయాణ సమయాల్లో ఎలాంటి ఆపదలు రాకుండా చూడాలని దేవుళ్లను కోరుకుంటారు. అయితే వాస్తు ప్రకారం, కారు డ్యాష్‌బోర్డ్‌పై దేవతల విగ్రహాలను పెట్టుకోవచ్చా? ఒకవేళ పెడితే ఎలాంటి నియమాలు పాటించాలి..? వివరాలు తెలుసుకోండి.

*విగ్రహాల ఏర్పాటు శుభప్రదం

సాధారణంగా కారు డ్యాష్‌బోర్డ్ మీద వినాయకుడు, హనుమంతుడు, శివుడు, ఇతర దేవతల ప్రతిమలను ఏర్పాటు చేసుకుంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం.. దేవతల ప్రతిమలను కారు డ్యాష్‌బోర్డ్ మీద ఏర్పాటు చేయడం శుభప్రదంగా పరిగణిస్తారు. ముఖ్యంగా వినాయక విగ్రహాన్ని ఉంచడం వల్ల రోడ్డుపై ఉన్న అడ్డంకులు తొలగిపోతాయని చాలామంది నమ్ముతారు. ఎగిరే హనుమాన్ విగ్రహాన్ని కూడా శుభప్రదంగా పరిగణిస్తారు. శివలింగం ఉంచితే శివుని నుంచి రక్షణ ఉండి, ప్రయాణం సురక్షితంగా జరుగుతుందని భావిస్తారు.

ఫోటో పెడితే నిబంధనలు పాటించాల్సిందే..

అయితే కారు డ్యాష్‌బోర్డ్‌పై దేవుళ్ల ప్రతిమలను ఉంచితే కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలని వాస్తు శాస్త్రం చెబుతోంది. కారులో ధూమపానం, మద్యపానం చేయకూడదు. మాంసాహారం తినకూడదు. ఇంకొన్ని ముఖ్యమైన రూల్స్ కూడా పాటించాలి. అవేంటంటే..

*విగ్రహాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి

కారులో డ్రైవర్, ప్రయాణికులకు అభిముఖంగా డ్యాష్‌బోర్డ్‌పై దేవతల విగ్రహాలను ఉంచాలి. ప్రతిరోజు శుభ్రమైన వస్త్రంతో వాటిని క్లీన్ చేస్తుండాలి. విగ్రహాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. విరిగిన లేదా దెబ్బతిన ప్రతిమలను ఏర్పాటు చేయకూడదు. ఒకవేళ అవి దెబ్బతింటే, వెంటనే దాన్ని నదిలో నిమజ్జనం చేసి కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలి.