వినాయ‌కుడిని వీటితో కూడా అందంగా చెయోచ్చు..

Date:

వినాయ‌క చ‌వితి వ‌స్తుందంటే చాలు.. నానా హంగామా ఉంటుంది.. చిన్న పిల్ల‌ల నుంచి పెద్ద‌ల వ‌ర‌కు న‌వ‌రాత్రులు సంద‌డి, సంద‌డిగా గ‌డుపుతారు.. ప్రతి సంవత్సరం వినాయక చవితి సందర్భంగా గణపతి విగ్రహాన్ని ఇంటి వద్ద, బహిరంగ ప్రదేశాల్లో లేదా మండపాలలో ప్రతిష్టించి పూజిస్తారు. విగ్రహాన్ని 9 లేదా 10 రోజులు గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుపుతారు. భజన, కీర్తన సహా అనేక మతపరమైన కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం 10 వ రోజు గణేశ విగ్రహాన్ని నదిలో లేదా చెరువులో నిమజ్జనం చేస్తారు. అయితే గతం కంటే ఇప్పుడు ప్రజల్లో పర్యావరణం గురించి అవగాహన పెరుగుతోంది. దీంతో ప్రజలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌కు బదులుగా మట్టి లేదా పర్యావరణ అనుకూల విగ్రహాలను ప్రతిష్టిస్తున్నారు. ఎందుకంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ నీటిని కలుషితం చేస్తుంది.

ఈ నేపధ్యంలో మట్టితో చేసిన పర్యావరణ అనుకూలమైన గణపతి విగ్రహం మీద ఎక్కువమంది ఆసక్తిని చూపిస్తున్నారు. అయితే ఇంట్లో కూడా పర్యావరణ అనుకూలమైన గణపతి విగ్రహాన్ని తయారు చేసుకోవచ్చు. మట్టి విగ్రహ తయారీ కోసం, పర్యావరణ అనుకూలమైన గణపతి విగ్రహాన్ని తయారు చేయడానికి ఒక కిట్ కూడా మార్కెట్ లో లభిస్తుంది. ఈ కిట్ ని ఉపయోగించి వినాయక విగ్రహాన్ని తయారు చేయవచ్చు.

ఆవు పేడ

ఆవు పేడతో చేసిన విగ్రహాలు పర్యావరణ అనుకూలమైనవి. అటువంటి పరిస్థితిలో మీరు కూడా వినాయక చవితి రోజున ఆవు పేడతో చేసిన వినాయక విగ్రహాన్ని కూడా ప్రతిష్టించవచ్చు.

పసుపు

వంటగదిలో లభించే పసుపుతో కూడా బొజ్జ గణపయ్య విగ్రహాన్ని తయారు చేయవచ్చు. ముందుగా పసుపును మెత్తగా పిండిగా చేసి ఆ తర్వాత ఆ పసుపుతో వినాయకుని విగ్రహాన్ని తయారు చేయండి

బియ్యం పిండి

ఇంట్లో లభించే బియ్యం పిండితో కూడా గణపతి విగ్రహాన్ని కూడా సిద్ధం చేసుకోవచ్చు. దీని కోసం పసుపు, బీట్‌రూట్‌లను జోడించి.. ఈ రెండింటిలో దేనినైనా రసంతో బియ్యంపిండి కలిపి.. ఆకులతో అలంకరించాలి.

సగ్గుబియ్యం

మట్టితో చేసిన లేదా ఇంటిలో పర్యావరణ అనుకూలమైన గణపతి విగ్రహాన్ని అలంకరించేందుకు సగ్గు బియ్యం, డ్రై ఫ్రూట్స్, బియ్యం, రంగురంగుల పప్పులు, ఆర్గానిక్ పెయింట్లను ఉపయోగించవచ్చు.

విగ్రహం తయారు చేసే విధానం

గణేశుని విగ్రహాన్ని తయారు చేయడానికి సాధారణ మట్టి, పసుపు లేదా పిండి వంటి ఏదైనా ఉపయోగించవచ్చు. అప్పుడు మట్టిని ముందుగా తడిపి మృదువుగా చేయండి. తర్వాత విగ్రహం తయారు చేయడం సులభం.

Share post:

Popular

More like this
Related

5రోజుల్లో 10లక్షల మందికి ఆహారం

ఎడ‌తెరిని లేని వ‌ర్షాల కార‌ణంగా ఉప్పొంగిన వ‌ర‌ద‌ల‌తో విజ‌య‌వాడ అత‌లాకుతలంగా మారిపోయింది....

వ‌ర‌ద‌ల‌తో తెలంగాణ తీవ్రంగా న‌ష్ట‌పోయింది

తెలంగాణ రాష్ట్రంలో వరద నష్టం తీవ్రంగా ఉందని, తక్షణ సాయంతో పాటు...

విద్యుత్ అధికారులు లంచం అడిగితే ఫిర్యాదు చెయ్యండి

ప్ర‌భుత్వ అధికారులు ప్ర‌జ‌ల‌కు సేవ చేయాలి. ప్ర‌జ‌ల‌కు నిరంత‌రం అందుబాటులో ఉండాలి.....

జూనియ‌ర్ వైద్యురాలిపై గ్యాంగ్‌రేప్ కాదు

పశ్చిమ బెంగాల్ కోల్‌క‌తాలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన అత్యాచారం, హత్య ఘటన...