Sunday, September 29, 2024
Homeక్రైంమహిళా రెజ్లర్ల ఆరోపణల్లో నిజం లేదు

మహిళా రెజ్లర్ల ఆరోపణల్లో నిజం లేదు

Date:

మహిళా రెజ్లర్లు తనపై చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని బ్రిజ్‌ భూషణ్‌ పిటీషన్‌లో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై మరింత విచారణ జరపాలని కోరుతూ బ్రిజ్‌ భూషణ్‌ పిటీషన్‌ దాఖలు చేశారు. జాతీయ రెజ్లింగ్‌ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌సింగ్‌పై నమోదైన లైంగిక వేధింపుల కేసు వ్యవహారంలో ఢిల్లీ కోర్టు తీర్పును రిజర్వ్‌ చేసింది. ఈ కేసులో నేడు తీర్పు వెలువరించాల్సి ఉంది.

2022 సెప్టెంబరు 7న డబ్ల్యూఎఫ్‌ఐ కార్యాలయానికి వెళ్లినప్పుడు నేరం జరిగిందని రెజర్లు ఆరోపిస్తున్నారు. కానీ, వారు చెప్పిన తేదీల్లో తాను అసలు దేశంలోనే లేనప్పుడు నేరం ఎలా జరుగుతుందన్నారు. ఈ కేసులో ప్రస్తుతం వారి నాటి కాల్‌ డిటైల్‌ రికార్డ్స్‌పై తాను ఆధారపడినట్లు తెలిపారు. అయితే, పోలీసులు మాత్రం ఈ సీడీఆర్‌ను రికార్డుల్లో చూపించలేదని ఆయన తరఫున న్యాయవాది పిటీషన్‌లో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై మరింత విచారణ జరపాలని కోర్టుకు విన్నవించారు. ఈ నేపథ్యంలో తీర్పును రిజర్వ్‌ చేసిన న్యాయమూర్తి.. ఏప్రిల్ 26కు వాయిదా వేశారు. బ్రిజ్‌ భూషణ్ తమను లైంగికంగా వేధిస్తున్నాడని దేశంలోని ప్రముఖ మహిళా రెజ్లర్లు జంతర్‌మంతర్‌ వద్ద ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రెజ్లింగ్‌ వ్యవహారాల నుంచి బ్రిజ్‌ భూషణ్‌ రిటైర్మెంట్‌ తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ కేసుపై న్యాయస్థానంలో విచారణ జరుగుతోంది.