Sunday, September 29, 2024
Homeక్రైంతేదీ ముగిసిన చాక్లెట్లు తిన్న చిన్నారి

తేదీ ముగిసిన చాక్లెట్లు తిన్న చిన్నారి

Date:

తేదీ ముగిసిన చాక్లెట్లు తిన్న ఏడాదిన్నర వయసున్న పాప రక్తం వాంతులు కావడంతో ఆ చిన్నారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమ్మిన షాపులోని గడువు ముగిసిన చాక్లెట్లు, ఇతర తినుబండారాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పంజాబ్‌లోని లూథియానాలో ఈ సంఘటన జరిగింది. ఆ చిన్నారి తన కుటుంబంతో కలిసి పాటియాలా వెళ్లింది. సెండాఫ్‌ సందర్భంగా బంధువులు స్నాక్స్‌, చాక్లెట్లతో కూడిన బాక్స్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు. లూథియానాకు తిరిగి వచ్చిన తర్వాత బాక్స్‌లోని చాక్లెట్లను ఆ బాలిక తిన్నది. దీంతో ఆ పాపకు రక్తం వాంతులు అయ్యాయి. ఆందోళన చెందిన తల్లిదండ్రులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. గడువు ముగిసిన చాక్లెట్లు తినడం వల్ల ఆ చిన్నారి అస్వస్థతకు గురైనట్లు వైద్య పరీక్షల్లో నిర్ధారించారు. ఆ పాపను ఆసుపత్రిలో అడ్మిట్‌ చేసి చికిత్స అందిస్తున్నారు.

మరోవైపు గడువు ముగిసిన చాక్లెట్ల అమ్మకం గురించి ఆరోగ్య అధికారులు, పోలీసులకు ఆ పాప బంధువులు ఫిర్యాదు చేశారు. దీంతో వాటిని అమ్మిన షాపును అధికారులు తనిఖీ చేశారు. ఆ షాపులో ఉన్న గడువు ముగిసిన చాక్లెట్లు, ఇతర స్నాక్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఏడాది మార్చిలో పంజాబ్‌లోని పాటియాలాలో పదేళ్ల బాలిక తన పుట్టిన రోజున కేక్ తిన్నది. ఆ వెంటనే అస్వత్థతకు గురై మరణించింది. పాడై విషపూరితంగా మారిన కేక్‌ తినడం వల్ల ఆమె చనిపోయినట్లు నిర్ధారించారు. ఆ కేక్‌ తిన్న బాలిక కుటుంబ సభ్యులు కూడా అనారోగ్యం పాలయ్యారు. అయితే వారు కోలుకున్నారు.