Friday, September 27, 2024
Homeక్రైంకవిత మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌ వాయిదా

కవిత మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌ వాయిదా

Date:

ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో అరెస్టయిన బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై విచారణ ఏప్రిల్‌ 4కు వాయిదా పడింది. తన కుమారుడి పరీక్షల దృష్ట్యా ఈ నెల 16 వరకు బెయిల్‌ మంజూరు చేయాలని మార్చి 26న ఆమె రౌస్‌ అవెన్యూ న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. కవిత పిటిషన్‌పై సమాధానం చెప్పాలని న్యాయస్థానం ఈడీకి నోటీసులు జారీ చేస్తూ.. విచారణను వాయిదా వేసింది. గత నెల 15న హైదరాబాద్‌లోని తన నివాసంలో కవితను ఈడీ అరెస్టు చేసి మరుసటి రోజు రౌస్‌ అవెన్యూ కోర్టులో హాజరుపరిచిన సంగతి తెలిసిందే.

ముందుగా ఈడీ 10 రోజుల కస్టడీకి కోరగా.. న్యాయస్థానం ఏడు రోజులకు అనుమతి ఇచ్చింది. అనంతరం మరో ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరగా.. మూడు రోజులకు అనుమతించింది. ఈడీ కస్టడీ మార్చి 26న ముగియడంతో.. అదే రోజు కోర్టులో దర్యాప్తు సంస్థ అధికారులు ఆమెను హాజరు పరిచారు. ఆ తర్వాత కవితకు 14 రోజుల జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించడంతో తిహాడ్‌ జైలుకు తరలించారు.