Tuesday, October 15, 2024
Homeక్రైంవాయుసేన‌లో మ‌హిళా అధికారిపై లైంగిక వేధింపులు

వాయుసేన‌లో మ‌హిళా అధికారిపై లైంగిక వేధింపులు

Date:

భార‌త వాయుసేనలో మ‌హిళా అధికారిపై లైంగిక వేధింపుల కేసు కలకలం సృష్టించింది. గత రెండు సంవత్సరాలుగా వింగ్‌ కమాండర్‌ తనను మానసికంగా వేధించడంతోపాటు అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ జమ్మూ కశ్మీర్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఓ మహిళా అధికారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై బుద్గాం స్టేషన్‌ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఈ ఇద్దరు ఆఫీసర్లు శ్రీనగర్‌ బేస్‌లోనే పనిచేస్తున్నట్లు తెలిసింది.

వింగ్‌ కమాండర్‌గా పనిచేస్తున్న అధికారి డిసెంబర్‌ 31, 2023న తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు పోలీసు ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. అసహజ శృంగారంలో పాల్గొనాలని బలవంతం చేస్తున్నాడని పేర్కొంది. గత రెండేళ్లుగా లైంగికంగా, మానసికంగా వేధిస్తున్నాడని తెలిపింది. ఈ కేసు విచారణలో బుద్గాం పోలీసులకు వాయుసేన సహకరిస్తున్నట్లు సమాచారం.