Thursday, October 10, 2024
Homeక్రైంలంచంగా 5కేజీల ఆలుగడ్డలు అడిగినా ఎస్ఐ..

లంచంగా 5కేజీల ఆలుగడ్డలు అడిగినా ఎస్ఐ..

Date:

ఓ ఎస్ఐ 5 కేజీల ఆలుగడ్డలు లంచంగా ఇవ్వాలని అడిగినందుకు సస్పెండ్ అయ్యాడు. ఆలుగడ్డలు కొనడానికి ఎస్ఐ వద్ద డబ్బుల్లేవు అని అనుకుంటున్నారు కాని అలుగడ్డలు అనే పదాన్ని లంచానికి కోడ్ వర్డ్‌గా ఉపయోగించాడు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌కి చెందిన రామ్ కృపాల్ సింగ్ అనే పోలీస్ సారిఖ్ స్టేషన్ పరిధిలోని భావల్‌పూర్ చపున్నా చౌకీలో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు.

ఓ కేసును పరిష్కరించేందుకు బాధితుడి నుంచి ఆయన లంచం డిమాండ్ చేశారు. బాధితుడు అయిన రైతును ఎస్ఐ ‘5 కేజీల ఆలుగడ్డలు’ లంచంగా కావాలని కోరాడు. అయితే రైతు 2 కిలోలు మాత్రమే ఇచ్చాడు. దానికి ఎస్ఐ అంగీకరించలేదు. చివరికి 3 కిలోల ఆలుగడ్డలకు ఒప్పందం కుదిరింది. దీనికి సంబంధించిన సంభాషణల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ క్రమంలోనే ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. డబ్బుల కోసం ఆలుగడ్డల్ని కోడ్ వర్డ్‌గా వాడినట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే ఎస్ఐని సస్పెండ్ చేస్తూ కన్నౌజ్ ఎస్పీ అమిత్ కుమార్ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు కేసుపై శాఖపరమైన విచారణ చేపట్టారు.