Saturday, December 7, 2024
Homeక్రైంములుగు జిల్లాలో అంగన్‌వాడీ టీచర్ దారుణ హత్య

ములుగు జిల్లాలో అంగన్‌వాడీ టీచర్ దారుణ హత్య

Date:

ములుగు జిల్లా తాడ్వాయి మండల పరిధిలో అంగన్‌వాడీ టీచర్ దారుణ హత్యకు గురైంది. తాడ్వాయి మండలం కాటాపురం గ్రామానికి చెందిన సుజాత ఊళ్లో అంగన్‌వాడీ టీచర్‌ విధులు నిర్వర్తిస్తోంది. మంగళవారం మధ్యాహ్నం డ్యూటీ ముగియగానే తన స్వగ్రామం ఏటూరునాగారానికి పయనమైంది. బుధవారం ఉదయం తాడ్వాయి సమీపంలో అటవీ ప్రాంతంలో కొందరు కూలీ పనుల కోసం వెళ్లగా అక్కడ సుజాత మృతదేహాం కనిపించింది. దీంతో షాక్ గురైన వారంతా వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. ఈ మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సుజాత మెడకు గట్టిగా స్కార్ఫ్‌తో చుట్టి ఉరేసి హతమార్చినట్లుగా గుర్తించారు. అదేవిధంగా సుజాత ఒంటిపై ఉన్న 4 తులాల బంగారం, సెల్‌ఫోన్‌ కూడా దుండగులు ఎత్తుకెళ్లారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.