మహిళకు కన్ను కొట్టాడని రూ.15,000 ఫైన్

Date:

మనదేశంలో మహిళల రక్షణ కోసం ఎన్నో చట్టాలు వచ్చాయి. మహిళవైపు అనుమానాస్పదంగా చూడటం, మహిళను చెడు ఉద్దేశంతో పేరు పెట్టి పిలవడం వంటివి కూడా నేరాలే. మహిళలు వేసుకున్న డ్రెస్ గురించి, డ్రెస్ కలర్ గురించి మాట్లాడటం కూడా తప్పే. ఇలా చట్టాల్లో చాలా అంశాలు ఉండాయి. కానీ అవి అమలవ్వడం అరుదు. చట్టాలు సరిగా అమలు చెయ్యకపోతే, చట్టం ఉంది అనే విషయాన్ని ప్రజలు మర్చిపోతారు. ఫలితంగా నేరాలు ఆగవు.

ఓ వ్యక్తి మహిళకు కన్నుకొట్టాడు. అతనికి బాంబే హైకోర్టు రూ.15,000 ఫైన్ వేసింది. మహ్మద్ కైఫ్ ఫకీర్ అనే వ్యక్తి, ఓ మహిళను అసభ్యంగా తాకడమే కాకుండా.. కన్నుకొట్టాడు. వెంటనే చెంప చెళ్లుమనిపించాలనుకున్న ఆమె అలా చెయ్యలేకపోయింది. కానీ ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది. ఈ కేసు క్రమంగా కోర్టుకు వెళ్లింది. కోర్టులో విచారణ జరిగింది. విచారణలో ఫకీర్ దోషి అని కోర్టు తేల్చింది. దాంతో.. కన్ను కొట్టినందుకు, అసభ్యంగా తాకినందుకు.. ఓవరాల్‌గా మహిళతో అగౌరవంగా ప్రవర్తించినందుకు అతనికి రూ.15,000 జరిమానా వేసింది. దేశవ్యాప్తంగా రోజూ లక్షల మంది మహిళలతో చాలా మంది అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. వారంతా కేసులు పెట్టట్లేదు కాబట్టి.. అక్రమార్కులకు ఫైన్లు పడట్లేదు. అదే జరిగితే, ఈ వార్త కామన్ అయ్యేది. కానీ అలా జరగట్లేదు కాబట్టే.. ఈ వార్త వైరల్ అయ్యింది.

Share post:

Popular

More like this
Related

మాజీ ట్రైనీ ఐఎఎస్‌ పూజా ఖేడ్కర్‌కు కేంద్రం బిగ్‌ షాక్‌

మాజీ ట్రైనీ ఐఏఎస్‌ అధికారిణి పూజా ఖేడ్కర్‌కు కేంద్రం బిగ్‌ షాక్‌...

నా కుమార్తె, అల్లుడిని న‌దిలో తోసేయండి

నమ్మక ద్రోహానికి పాల్పడిన తన కుమార్తె, అల్లుడిని ప్రాణహిత నదిలో తోసేయాలని...

5రోజుల్లో 10లక్షల మందికి ఆహారం

ఎడ‌తెరిని లేని వ‌ర్షాల కార‌ణంగా ఉప్పొంగిన వ‌ర‌ద‌ల‌తో విజ‌య‌వాడ అత‌లాకుతలంగా మారిపోయింది....

వ‌ర‌ద‌ల‌తో తెలంగాణ తీవ్రంగా న‌ష్ట‌పోయింది

తెలంగాణ రాష్ట్రంలో వరద నష్టం తీవ్రంగా ఉందని, తక్షణ సాయంతో పాటు...