Saturday, November 9, 2024
Homeక్రైంమ‌ణిక‌ట్టు కోసుకొని ప్రియుడికి వీడియో పంపిన‌ యువ‌తి..

మ‌ణిక‌ట్టు కోసుకొని ప్రియుడికి వీడియో పంపిన‌ యువ‌తి..

Date:

దేశ రాజ‌ధాని ఢిల్లీలో ఒక యువ‌తి మ‌ణికట్టు కోసుకొని త‌న వీడియోను ప్రియుడికి పంపింది. అది చూసి ఆమెను ఆసుపత్రికి తరలించిన ప్రియుడు అక్కడ స్పృహతప్పి మరణించాడు. ఆ వ్యక్తి గుండెపోటు వల్ల చనిపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. శనివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో 30 ఏళ్ల అరుణ్ నందా స్నేహితురాలు చేతి మణికట్టుపై కత్తితో కోసుకున్నది. ఈ వీడియోను అతడికి పంపింది.

ఈ వీడియో చూసి అరుణ్‌ షాక్‌ అయ్యాడు. అతడు వెంటనే ఆమె ఉన్న ఆనంద్‌ విహార్‌ ప్రాంతానికి చేరుకున్నాడు. ప్రియురాలిని ఒక ప్రైవేట్‌ హాస్పిటల్‌కు తీసుకెళ్లాడు. అక్కడ ఆమె పరిస్థితి చూసి అరుణ్‌ స్పృహతప్పి పడిపోయాడు. పరిశీలించిన డాక్టర్లు అతడు మరణించినట్లు నిర్ధారించారు. మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ హాస్పిటల్‌కు చేరుకున్నారు. అరుణ్‌ గుండెపోటు వల్ల చనిపోయినట్లు అనుమానిస్తున్నారు. అతడి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.