భార్యను బైక్‌కు కట్టేసి.. ఊరంతా లాక్కెళ్లాడు

Date:

ఒక వ్యక్తి పూటుగా మద్యం తాగి ఆ మద్యం మత్తులో భార్యను బైక్‌కు కట్టేసి.. ఊరంతా లాక్కెళ్లిన ఘటన రాజస్థాన్‌లో జరిగింది. నగౌర్ జిల్లాలో జరిగిన ఈ ఘటనకు చెందిన వీడియో ఒకటి వైరల్ అవుతున్నది. దీంతో ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. నార్సింగపూర్ గ్రామంలో నెల రోజుల క్రితం ఈ ఘటన జరిగినట్లు పాంచౌడి పోలీసు స్టేషన్ ఎస్ఐ సురేంద్ర కుమార్ తెలిపారు. బైక్‌కు భార్య కట్టడానికి ముందు ఆమెను భర్త తీవ్రంగా కొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. బైక్‌కు కట్టేసిన తర్వాత ఆమెను లాక్కెళ్లాడు.

వీడియో ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆ మహిళ బంధువుల వద్ద ఉంటోంది. ఈ విషయాన్ని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. నిందితుడు మేఘవాల్ తాగుబోతు అని, ఎప్పుడూ భార్యను కొట్టేవాడని సాక్ష్యులు తెలిపారు. ఎవరితోనూ ఆమె మాట్లాడనివ్వకుండా చేసేవాడని గ్రామస్థులు చెప్పారు.

Share post:

Popular

More like this
Related

ట్రైనీ డాక్ట‌ర్ శ‌వ‌ప‌రీక్ష కీల‌క‌పత్రం మిస్సింగ్‌

ప‌శ్చిమ‌బెంగాల్ కోల్‌కతా ట్రైనీ డాక్టర్‌ శవపరీక్షకు సంబంధించిన కీలక పత్రం మిస్‌...

డాక్ట‌ర్ల నిర‌స‌న వ‌ల్ల 23మంది రోగులు మృతి

ప‌శ్చిమ‌బెంగాల్ కోల్‌క‌తాలో జూనియ‌ర్ వైద్యురాలిపై జ‌రిగిన అత్యాచారం, హ‌త్య‌పై ప‌శ్చిమ బెంగాల్‌తో...

నిర్మాణంలో ఉన్న ఇళ్లను మాత్ర‌మే కూల్చుతున్నాం

ఎఫ్‌టీఎల్‌, బ‌ఫ‌ర్‌జోన్‌లోకి వ‌చ్చే నిర్మాణ ద‌శ‌లో ఉన్న ఇళ్ల‌ను మాత్ర‌మే కూలుస్తున్నామ‌ని...

ఎవ‌రికి అర్థం కాని మందులు రాసిన వైద్యుడు

పెషేంట్ల‌కు వైద్యులు రాసే మందులు అర్థ‌మ‌య్యే విధంగా ఉండాల‌ని ప్ర‌భుత్వ నిబంధ‌న‌లు...