ఎస్సీ మహిళపై ఖాకీల లాకప్ హింస

Date:

ఒక ఎస్సీ మహిళపై ఖాకీల లాఠీల ప్రతాపం చూపించారు. బంగారం దొంగతనం చేశారనే ఆరోపణలతో అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎస్సీ మహిళను దారుణంగా కొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ అమానుష చర్య సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని షాద్‌నగర్ పోలీస్‌ స్టేషన్‌లో చోటు చేసుకుంది. లాకప్‌ హింస ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని శంషాబాద్‌ డీసీపీ తెలిపారు.

వివరాల్లోకి వెళితే.. గత నెల 24న షాద్‌నగర్‌ పట్టణంలోని అంబేడ్కర్‌ కాలనీకి చెందిన సునీత, భీమయ్య దంపతులు దొంగతనం చేశారని నాగేందర్‌ అనే వ్యక్తి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సునీత, భీమయ్యతో పాటు వారి 13 ఏళ్ల కుమారుడిని స్టేషన్‌కు తీసుకెళ్లారు. అనంతరం భర్తను వదిలేసిన డిటెక్టివ్‌ సీఐ రామిరెడ్డి, అతని సిబ్బంది బాధితురాలు సునీతను కుమారుడి ముందే విచక్షణా రహితంగా కొట్టడంతో తీవ్రంగా గాయపడింది. దొంగతనం చేసినట్టు ఒప్పుకోవాలని సీఐ తీవ్రంగా కొట్టడంతో స్పృహ కోల్పోయానని, ఆ తర్వాత ఇంటికి పంపించారని బాధితురాలు వాపోయింది. 24 తులాల బంగారం, రూ.2 లక్షల నగదుకు గానూ కేవలం ఒక తులం బంగారం, రూ.4వేల నగదు రికవరీ చేశామని పోలీసులు చెబుతున్నారు. మహిళపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పది రోజులు గడుస్తున్నా రిమాండ్ చెయ్యకుండా ఇంటికి పంపించడం వెనుక పోలీసులు కొట్టిన దెబ్బలకు మహిళ గాయపడటమే కారణంగా తెలుస్తోంది. పోలీసుల తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో పోలీసు ఉన్నతాధికారులు స్పందించి విచారణకు ఆదేశించారు.

Share post:

Popular

More like this
Related

ట్రైనీ డాక్ట‌ర్ శ‌వ‌ప‌రీక్ష కీల‌క‌పత్రం మిస్సింగ్‌

ప‌శ్చిమ‌బెంగాల్ కోల్‌కతా ట్రైనీ డాక్టర్‌ శవపరీక్షకు సంబంధించిన కీలక పత్రం మిస్‌...

డాక్ట‌ర్ల నిర‌స‌న వ‌ల్ల 23మంది రోగులు మృతి

ప‌శ్చిమ‌బెంగాల్ కోల్‌క‌తాలో జూనియ‌ర్ వైద్యురాలిపై జ‌రిగిన అత్యాచారం, హ‌త్య‌పై ప‌శ్చిమ బెంగాల్‌తో...

నిర్మాణంలో ఉన్న ఇళ్లను మాత్ర‌మే కూల్చుతున్నాం

ఎఫ్‌టీఎల్‌, బ‌ఫ‌ర్‌జోన్‌లోకి వ‌చ్చే నిర్మాణ ద‌శ‌లో ఉన్న ఇళ్ల‌ను మాత్ర‌మే కూలుస్తున్నామ‌ని...

ఎవ‌రికి అర్థం కాని మందులు రాసిన వైద్యుడు

పెషేంట్ల‌కు వైద్యులు రాసే మందులు అర్థ‌మ‌య్యే విధంగా ఉండాల‌ని ప్ర‌భుత్వ నిబంధ‌న‌లు...