ఓ మహిళా కానిస్టేబుల్ తన ప్రేమికుడితో కలిసి తన కారుతో సబ్ ఇన్‌స్పెక్టర్‌ను ఢీకొట్టి, 30 మీటర్లు ఈడ్చుకెళ్లింది. జాతీయ రహదారిపై మహిళా కానిస్టేబుల్ ఈ హత్యకు పాల్పడింది. చనిపోయిన సబ్ ఇన్‌స్పెక్టర్‌ను దీపాంకర్ గౌతమ్‌గా గుర్తించారు. దీపాంకర్ రాజ్‌గఢ్ పోలీస్ లైన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. సబ్-ఇన్‌స్పెక్టర్ హత్యకు పాల్పడినవారు పచోర్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ పల్లవి సోలంకి, ఆమె ప్రియుడు కరణ్ ఠాకూర్‌గా గుర్తించారు.
ట్రయాంగిల్ ప్రేమలో మహిళా కానిస్టేబుల్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. మహిళా కానిస్టేబుల్, లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్న తన ప్రియుడితో కలిసి, ఎస్ఐ దీపాంకర్ గౌతమ్‌ను తన కారుతో ఢీకొట్టింది. అనంతరం వారిద్దరూ నేరుగా పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. ప్రమాదానికి కారణమైన కారు పచోర్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ పల్లవి సోలంకికి చెందినదిగా పోలీసులు గుర్తించారు. నేరం చేసిన తర్వాత, పల్లవి, ఆమె ప్రియుడు కరణ్ దేహత్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు.
పల్లవి ఆమె ప్రియుడు కరణ్ మొదట ఏదో ఒక సాకుతో జాతీయ జాతీయ రహదారిపై ఎస్ఐ దీపాంకర్ గౌతమ్‌ను పిలిచారు. ఆపై అతను వెళ్ళడానికి బైక్‌పై కూర్చున్నప్పుడు, బైక్‌ను వెనుక నుండి కారుతో ఢీకొట్టారు. వారిద్దరూ దీపాంకర్ బైక్‌ను ఢీకొట్టి కారు కింద నుజ్జునుజ్జు చేసి బైక్‌తో పాటు దీపాంకర్ మృతదేహాన్ని 30 మీటర్లు ఈడ్చుకెళ్లారు. మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లాలో దారుణం జరిగింది. సబ్ ఇన్‌స్పెక్టర్ హత్య సంచలనం సృష్టించింది.