విద్యార్థి తండ్రి చొక్కా విప్పి అవమానించిన టీచర్లు

Date:

ఓ విద్యార్థి తండ్రిని పాఠశాల కమిటీ ఎన్నికల్లో చొక్కా విప్పి అవమానించడంపై మంత్రి సంధ్యారాణి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మన్యం జిల్లా మక్కువ మండలంలోని మోడల్‌ స్కూల్‌లో ఇటీవల జరిగిన పాఠశాల కమిటీ ఎన్నికల సమయంలో ఓ విద్యార్థి తండ్రిపై టీచర్లు ప్రవర్తించిన తీరును ఆమె తప్పుబట్టారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో మంత్రి ప్రజల వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా తనకు జరిగిన అవమానంపై ఆ విద్యార్థి తండ్రి మంత్రికి వినతిపత్రం అందజేశారు.

దీనిపై స్పందించిన మంత్రి సంధ్యారాణి అధికారుల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. పసుపు చొక్కా వేసుకున్నారన్న సాకుతో గిరిజనుడిని రెండు గంటల పాటు నగ్నంగా నిలబెట్టడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. ఈ ఘటనకు బాధ్యులపై విద్యాశాఖ తక్షణమే కఠిన చర్యలు చేపట్టేలా చూడాలని డీఈవోను ఆదేశించారు. ఈ ఘటనకు సహకరించిన హోంగార్డు, హెచ్ఎంపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

Share post:

Popular

More like this
Related

వినూత్న కథాంశంతో మైక్రో ఫిల్మ్ దిక్సూచి

స‌మాజంలో అమ్మాయిల‌పై జ‌రుగుతున్న అఘాయిత్యాలే ప్ర‌ధాన అంశంగా వినూత్న క‌థాంశంతో తెర‌కెక్కుతున్న...

ట్రైనీ డాక్ట‌ర్ శ‌వ‌ప‌రీక్ష కీల‌క‌పత్రం మిస్సింగ్‌

ప‌శ్చిమ‌బెంగాల్ కోల్‌కతా ట్రైనీ డాక్టర్‌ శవపరీక్షకు సంబంధించిన కీలక పత్రం మిస్‌...

డాక్ట‌ర్ల నిర‌స‌న వ‌ల్ల 23మంది రోగులు మృతి

ప‌శ్చిమ‌బెంగాల్ కోల్‌క‌తాలో జూనియ‌ర్ వైద్యురాలిపై జ‌రిగిన అత్యాచారం, హ‌త్య‌పై ప‌శ్చిమ బెంగాల్‌తో...

నిర్మాణంలో ఉన్న ఇళ్లను మాత్ర‌మే కూల్చుతున్నాం

ఎఫ్‌టీఎల్‌, బ‌ఫ‌ర్‌జోన్‌లోకి వ‌చ్చే నిర్మాణ ద‌శ‌లో ఉన్న ఇళ్ల‌ను మాత్ర‌మే కూలుస్తున్నామ‌ని...