Sunday, October 6, 2024
HomeUncategorizedఒక్క‌రోజే పిడుగుపాటుకు 38మంది మృతి

ఒక్క‌రోజే పిడుగుపాటుకు 38మంది మృతి

Date:

భారతదేశంలోని పలు రాష్ట్రాలను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో పిడుగుపాటు కారణంగా 38 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మరణాలన్నీ ఒక్క రోజులోనే సంభవించడం గమనార్హం. వీటి కారణంగా మరికొందరు గాయపడినట్లు తెలుస్తోంది. వరదల కారణంగా యూపీలో జనజీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. బుధవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. వేరువేరు ప్రాంతాల్లో పడిన పిడుగుల కారణంగా 38 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో ఓ మహిళ, చిన్నారులు కూడా ఉండడం విషాదకరం. పిడుగుపాటు వల్ల ప్రతాప్‌గఢ్‌లో అత్యధికంగా 11 మంది మరణించారు. సుల్తాన్‌పుర్‌లో ఏడుగురు, చందౌలీలో ఆరుగురు, మెయిన్‌పురలో ఐదుగురు, ప్రయాగ్‌రాజ్‌లో నలుగురు, మరికొన్ని జిల్లాల్లో ఒక్కో మరణం సంభవించినట్లు అధికారులు వెల్లడించారు.

రానున్న ఐదు రోజుల్లో యూపీలో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. పొరుగు రాష్ట్రాలు సహా కేంద్రపాలిత ప్రాంతాల్లో తీవ్ర వర్షపాతం కొనసాగుతుందని అంచనా వేసింది. కాగా.. ముంబయి నగరంలో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. రాబోయే మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో కొన్ని ప్రాంతాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది.