Wednesday, October 2, 2024
HomeUncategorizedనిందితుడి కోసం ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డుకు పోలీసు వాహనం

నిందితుడి కోసం ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డుకు పోలీసు వాహనం

Date:

ఎయిమ్స్‌ రిషికేశ్‌ సర్జరీ యూనిట్‌లో విధుల్లో ఉన్న సమయంలో నర్సింగ్ ఆఫీసర్ తనను లైంగికంగా వేధించారంటూ రెండురోజుల క్రితం ఒక జూనియర్ డాక్టర్ ఆరోపించారు. అతడు తనకు అసభ్యకర సందేశాలు పంపినట్లు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఇతర వైద్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడిని తొలగించాలంటూ వారు నిరసన చేపట్టారు. ఈ క్రమంలోనే నర్సింగ్ ఆఫీసర్‌ను అరెస్టు చేసేందుకు పోలీసులు రాగా.. బయట ఆందోళన చేస్తున్న సిబ్బందిని చూసి తమ వాహనంతో నేరుగా ఎమర్జెన్సీ వార్డుకు వెళ్లిపోయారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకున్నారు.

పోలీసు వాహనం లోపలికి వెళ్తున్న వీడియోలో బెడ్లపై పేషంట్లు కనిపించారు. ఎస్‌యూవీ వస్తుండగా.. కొందరు భద్రతా సిబ్బంది అది వెళ్లడానికి దారిని సిద్ధం చేశారు. అలాగే నిందితుడిని అరెస్టు చేసినప్పుడు పోలీసులు అక్కడి వైద్యులను అదుపు చేయడం ఆ దృశ్యాల్లో కనిపించాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇలా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎయిమ్స్ యాజమాన్యం అతడిపై సస్పెన్షన్‌ వేటు వేసింది. ఆ శిక్ష సరిపోదని వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్లు వ్యక్తమయ్యాయి.