Sunday, September 29, 2024
HomeUncategorizedఅన్న వైఎస్ జగన్ దగ్గర తీసుకున్న అప్పు రూ.82.58 కోట్లు

అన్న వైఎస్ జగన్ దగ్గర తీసుకున్న అప్పు రూ.82.58 కోట్లు

Date:

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడప పార్లమెంట్ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు సందర్భంగా.. ఎన్నికల అఫిడవిట్లో తనకున్న ఆస్తులు, అప్పులు, కేసుల వివరాలను షర్మిల ప్రస్తావించారు. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం వైఎస్ షర్మిల ఆస్తులు, అప్పుల వివరాలు ఇలా ఉన్నాయి. వైఎస్ షర్మిల తనకు రూ.182.82 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. స్థిరాస్తులు రూ.9.29 కోట్లు కాగా.. చరాస్తులు రూ.123.26 కోట్లని తెలిపారు. అలాగే తన వద్ద రూ.3.69 కోట్ల విలువైన బంగారు, రూ.4.61 కోట్ల విలువైన జెమ్ స్టోన్స్ ఆభరణాలు ఉన్నట్లు షర్మిల తన ఎన్నికల అఫిడవిట్లో ప్రస్తావించారు.

అప్పుల విషయానికి వస్తే.. తన అన్న, వైఎస్ జగన్ వద్ద రూ.82.58 కోట్లు అప్పు తీసుకున్నట్లు వైఎస్ షర్మిల తన అఫిడవిట్లో పేర్కొన్నారు. అలాగే వైఎస్ జగన్ సతీమణి, తన వదిన వైఎస్ భారతి రెడ్డి వద్ద రూ.19.56 లక్షలు అప్పు తీసుకున్నట్లు తెలిపారు. వైఎస్ షర్మిల భర్త.. బ్రదర్ అనికల్ కుమార్.. షర్మిల తల్లి.. తన అత్తగారైన వైఎస్ విజయమ్మ వద్ద 40 లక్షలు అప్పు తీసుకున్నట్లు అఫిడవిట్లో ఉంది. తనపై ఎనిమిది కేసులు ఉన్నట్లు షర్మిల ఎన్నికల అఫిడవిట్లో వెల్లడించారు.