Sunday, September 29, 2024
HomeUncategorizedకేంద్ర మంత్రి అమిత్ షాకు సొంత కారు లేదు

కేంద్ర మంత్రి అమిత్ షాకు సొంత కారు లేదు

Date:

కేంద్ర హోంమంత్రి, బిజెపి సీనియర్ నేత అమిత్ షా గుజరాత్‌లోని గాంధీనగర్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. అయన శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. తనకు మొత్తం రూ.36 కోట్ల స్థిర, చరాస్తులు ఉన్నట్లు ప్రకటించారు. ఇప్పటికీ తనకు సొంత కారు లేదని పేర్కొన్నారు. నామినేషన్‌ వివరాల ప్రకారం.. అమిత్ షాకు రూ.20 కోట్ల చర, రూ.16 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. తన భార్య సోనాల్‌కు రూ.31 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. కేంద్రమంత్రికి రూ.72 లక్షల విలువైన ఆభరణాలు, ఆయన సతీమణికి రూ.1.10 కోట్ల విలువైన నగలున్నాయి. అమిత్ షా పేరు మీద రూ.15.77లక్షల రుణం, సోనాల్‌ పేరు మీద రూ. 26.32లక్షల రుణం ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

2022-23లో కేంద్రమంత్రి వార్షికాదాయం రూ.75.09లక్షలుగా ఉండగా.. ఆయన సతీమణి రూ.39.54లక్షలు ఆర్జించారు. ఎంపీగా అందుకునే వేతనంతో పాటు భూమి, ఇంటి అద్దెలు, వ్యవసాయం, షేర్లు, డివిడెండ్ల నుంచి తనకు ఆదాయం వస్తున్నట్లు అఫిడవిట్‌లో తెలిపారు. వృత్తిరీత్యా తాను రైతునని, సామాజిక కార్యకర్తనని వెల్లడించారు. తనపై మూడు క్రిమినల్‌ కేసులు నమోదైనట్లు ప్రకటించారు.