Sunday, September 29, 2024
HomeUncategorizedబంగ్లాదేశ్‌ నుంచి వచ్చి ఓటేసిన భారతీయులు

బంగ్లాదేశ్‌ నుంచి వచ్చి ఓటేసిన భారతీయులు

Date:

బంగ్లాదేశ్‌ సరిహద్దు గ్రామాల్లో నివసిస్తున్న సుమారు 2500 మంది భారతీయులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు దేశ సరిహద్దు దాటారు. చారిత్రక కారణాల వల్ల త్రిపురకు చెందిన ప్రజలు భారత్‌, బంగ్లాదేశ్‌ సరిహద్దు గ్రామాల్లో నివసిస్తున్నారు. శుక్రవారం పశ్చిమ త్రిపుర పార్లమెంట్ స్థానానికి పోలింగ్‌ జరిగింది. త్రిపురలోని రాంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధికి చెందిన పలు గ్రామాలు భారత్‌, బంగ్లాదేశ్‌ సరిహద్దులో ఉన్నాయి. ఒక గ్రామంలో 19 భారతీయ కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇందులోని 50 మంది ఓటర్లు సరిహద్దు దాటి వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

భారత్‌-బంగ్లాదేశ్‌ సరిహద్దు సమీపంలోని జయనగర్‌తోపాటు పలు ప్రాంతాలకు చెందిన సుమారు 2,500 మంది భారతీయులు ఫెన్సింగ్‌ దాటి వచ్చి ఓటు వేశారు. త్రిపురలోకి ప్రవేశించిన గ్రామస్తులను ఫొటో గుర్తింపు కార్డుల ద్వారా బీఎస్‌ఎఫ్‌ జవాన్లు ధృవీకరిరించారు. అగర్తలా నగరానికి అతి సమీపంలో ఉన్న జయనగర్ ప్రాంతంలో మహిళా బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది విధులు నిర్వహించారు.