Sunday, September 29, 2024
HomeUncategorizedదేశంలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు

దేశంలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు

Date:

దేశంలో కాంగ్రెస్ పార్టీ అబద్దపు వాగ్దానాలు చేస్తుంటదని, బీజేపీ మాత్రం ఇచ్చిన హామీలను అమలుచేసి చూపించిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా సీఎన్ బీసీ ఆవాజ్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఎవరు వాగ్దానాలు చేస్తున్నారు.. ఎవరు వాటిని అమలు చేస్తున్నారనేది ప్రజలు చూస్తున్నారన్నారు. ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం మాత్రం కరోనా వంటి క్లిష్ఠ పరిస్థితులను ఎదర్కొంటూ కూడా దేశంలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేశారన్నారు. ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, ఫుడ్, వంటి పలు విషయాల పట్ల మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆధారంగా పేదరికం తగ్గిందని.. అంతేకానీ సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజలకు ప్రతి ఏటా రూ,1 లక్ష రూపాయలు ఇవ్వడం ద్వారా పేదరికం అంతం కాదని ఆమె అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రుణ మాఫీ వాగ్దానం.. దేశంలోని కనీసం 50 శాతం రైతులకు కూడా సహాయపడదని అన్నారు.

మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం..రైతులకు అనేక రకాలుగా సహాయమందిస్తోన్నారు. రైతుల ఆదాయం మెరుగుపడుతుందని, రైతులకు మార్కెట్ అందుబాటుపై ఫోకస్ పెట్టామని, రైతుల కోసం విసృతంగా మార్కెట్లు ఏర్పాటు చేయడంపై మోదీ ఫోకస్ పెట్టారని తెలిపారు. భారత్ లో సంస్థలు ఏర్పాటు చేసి,ఉత్పత్తులను మ్యానుఫ్యాక్చరింగ్ చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని కంపెనీలను, ఎంటర్ ప్రెన్యూర్ లను ఆహ్వానిస్తున్నట్లు ఆమె తెలిపారు. ప్రపంచ దిగ్గజ కంపెనీలకు.. భారత్ లో స్కిల్స్, మ్యాన్ పవర్, కాస్ట్ అడ్వాంటేజ్ ఉన్నట్లు తెలిపారు. ద్రవ్యోల్బణం క్రమంగా తగ్గుముఖం పడుతుందని, మోదీ ప్రభుత్వం 10లక్షల ప్రభుత్వ ఉద్యోగాల అపాయింట్ మెంట్ లెటర్స్ ఇచ్చినట్లు ఆమె తెలిపారు. డెవలప్ మెంట్, పేదరికం తగ్గింపు,సామాజిక ఎదుగుబాటు విషయాల్లో ప్రధాని మోదీ ఫర్పార్మెన్స్ రికార్డ్ ఫర్పెక్ట్ గా ఉన్నట్లు తెలిపారు. మోదీ ప్రభుత్వం గత 10 ఏళ్లల్లో చేసిన అభివృద్ధికి తాము మ్యాచ్ కామని విపక్షాలకు తెలుసన్నారు.