Sunday, September 29, 2024
HomeUncategorized'పేదరికం' వ్యాఖ్యలపై రాహుల్ వివరణ

‘పేదరికం’ వ్యాఖ్యలపై రాహుల్ వివరణ

Date:

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తాను చేసిన ‘పేదరికం’ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. ప్రధాని మోడీ విమర్శలు చేయడంతో రాహుల్ నుంచి స్పందన వచ్చింది. ఇటీవల రాజస్థాన్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో రాహుల్ మాట్లాడుతూ ”కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారి ఖాతాల్లో ప్రతీ ఏటా రూ.లక్ష వస్తూనే ఉంటుంది. చిటికెలో భారత్‌ నుంచి పేదరికాన్ని తొలగిస్తాం” అని వ్యాఖ్యలు చేశారు. దీనిపై మోడీ చెణుకులు విసిరారు. ”ఒక్క వేటుతో పేదరికాన్ని మాయం చేసే రాజ మాంత్రికుడు” అంటూ అభివర్ణించారు. ”ఇన్నేళ్లుగా ఈ రాకుమారుడు ఎక్కడ ఉన్నారు? ఆయన నాన్నమ్మ (ఇందిరా గాంధీ) 50 ఏళ్ల క్రితమే గరీబీ హఠావో నినాదం ఇచ్చిన విషయం ప్రజలకు తెలుసు” అంటూ రాహుల్ పేరు ప్రస్తావించకుండానే చురకలు వేశారు. ఈ క్రమంలో రాహుల్‌ నుంచి స్పందన వచ్చింది. ”ఒకే దెబ్బకు దారిద్య్రం తొలగిపోతుందని ఎవరూ చెప్పలేదు. కానీ అధికారంలోకి వస్తే మేము ఆ దిశగా మెరుగైన చర్యలు తీసుకోగలం” అంటూ తనపై వచ్చిన విమర్శలకు స్పష్టత ఇచ్చారు.