Friday, September 27, 2024
HomeUncategorizedసికింద్రాబాద్‌లో  ప్రారంభమైన  హునార్ మహోత్సవ్ ఎగ్జిబిషన్

సికింద్రాబాద్‌లో  ప్రారంభమైన  హునార్ మహోత్సవ్ ఎగ్జిబిషన్

Date:

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హునార్ మహోత్సవ్ ఎక్స్‌పో గాంధీ స్మృతి దర్శన్ సమితి, న్యూఢిల్లీ సహకారంతో హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రారంభమైంది. భారతదేశపు హస్తకళలు, వంటకాలు మరియు సంస్కృతి యొక్క మహోన్నత వారసత్వం ను ప్రతిబింబించే శక్తివంతమైన ప్రదర్శనను ఇది అందిస్తుంది. మార్చి 28 నుండి ఏప్రిల్ 8 వరకు, సికింద్రాబాద్‌లోని జింఖానా గ్రౌండ్‌లో 12 రోజుల పాటు జరిగే ప్రదర్శనను సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు డి. మధుకర్ నాయక్, సీఈఓ, ప్రారంభించారు. 25 కంటే ఎక్కువ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల నుండి 350 మంది కళాకారులు , చేతివృత్తుల వారిని కలిగి ఉన్న హునార్ మహోత్సవ్ ఎక్స్‌పో వివిధ రకాల చేతితో తయారు చేసిన వస్తువులను అందిస్తుంది. అప్లిక్ వర్క్ నుండి జనపనార-చెరకు హస్త కళల వరకు, ఇత్తడి ఉత్పత్తుల నుండి చెక్క బొమ్మలు మరియు మరెన్నో వీటిలో ఉంటాయి. భారతదేశంలోని నైపుణ్యం కలిగిన కళాకారుల యొక్క హస్తకళ మరియు విశిష్ట సాంస్కృతిక సంప్రదాయాలను అన్వేషించే అవకాశం సందర్శకులకు ఉంటుంది.

గాంధీ స్మృతి దర్శన్ సమితి వైస్ చైర్మన్ విజయ్ గోయెల్ మాట్లాడుతూ ఈ ఎగ్జిబిషన్ కేవలం ప్రదర్శన మాత్రమే కాదు. వైవిధ్యం, స్థిరత్వం మరియు భారతీయ చేతిపనులు , సంస్కృతి యొక్క వేడుక. మీరు సంప్రదాయ కళల అభిమాని అయినా, ఆహార ప్రియులైనా లేదా సంగీత ప్రేమికులైనా, ప్రతి ఒక్కరూ కనుగొని, మెచ్చుకోవడానికి ఇక్కడ ఏదో ఒకటి ఉంటుంది. ఈ ప్రదర్శన సందర్శకులకు ఎలాంటి ప్రవేశ రుసుము లేదు అని అన్నారు. ప్రతి ఒక్కరూ భారతదేశ హస్తకళా నైపుణ్య వీక్షణ మరియు రుచుల ఆస్వాదనను ఎలాంటి ఖర్చు లేకుండా చేయగలరు. మీరు కళాప్రేమికులైనా , ఆహార ప్రియులైనా లేదా భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని అన్వేషించాలనే ఆసక్తి ఉన్నవారైనా, ఎక్స్‌పో ప్రతి ఒక్కరికీ ఆనందం అందిస్తుంది. మార్చి 28 నుండి ఏప్రిల్ 8, 2024 వరకు, సికింద్రాబాద్‌లోని జింఖానా గ్రౌండ్‌లో మాతో చేరండి మరియు హునార్ మహోత్సవ్ ఎక్స్‌పోలో భారతదేశ అందాలు, రుచులు మరియు సంప్రదాయాలను ఆస్వాదించండి.