Friday, September 27, 2024
HomeUncategorizedకేజ్రీవాల్ అరెస్టుకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ

కేజ్రీవాల్ అరెస్టుకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ

Date:

లిక్కర్ కేసులో ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ అరెస్టుకు వ్యతిరేకంగా మార్చి 31న ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో ఇండియా కూటమి తలపెట్టిన భారీ ర్యాలీకి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అలాగే పోలీసు అధికారుల నుంచి కూడా గ్రీన్‌సిగ్నల్ వచ్చినట్లుగా సమాచారం. కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేయడాన్ని ఇండియా కూటమి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. రాజకీయ కుట్రలో భాగంగానే కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేశారని ఆరోపించింది. ఈ ఘటనపై ఇప్పటికే ఎన్నికల సంఘానికి కూటమి ఫిర్యాదు చేసింది. ఇక కేజ్రీవాల్‌కు మద్దతుగా దేశ రాజధానిలో ర్యాలీ చేపట్టేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం నుంచి, పోలీసుల నుంచి అనుమతి లభించినట్లుగా ఆప్ వర్గాలు చెబుతున్నాయి.

ర్యాలీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, శరద్ పవార్, ఉద్ధవ్ థాకరే, ఆదిత్య ఠాక్రే, సంజయ్ రౌత్, అఖిలేష్ యాదవ్, తేజస్వీ యాదవ్, డెరెక్ ఓబ్రెయిన్, తిరుచ్చి శివ, ఫరూక్ అబ్దుల్లా, జార్ఖండ్ ముఖ్యమంత్రి చంపాయ్ సోరెన్, హేమంత్ సోరెన్ సతీమణి కల్పనా సోరెన్, రాజారామ్ సోరెన్ సహా భారత కూటమి నాయకులు, ఇతరులు ఈ ర్యాలీలో పాల్గొననున్నారు.